వ‌ర్మ తాజా సినిమా ముప్పావ‌లా క‌థ ?

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా కెలకాలో, ఎవ‌రితో ఎన్నెన్ని తిట్లు తినాలో… వాటిని త‌న సినిమాల‌కు త‌న‌కు ఎంత‌లా  ప‌బ్లిసిటీ వ‌చ్చేలా చూసుకోవాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదన్న‌ది నిజం. ఆ మ‌ధ్య వ‌ర్మ‌ తెరకెక్కిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు  రాజ‌కీయ సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన ఆయ‌న తాజాగా మ‌రో రాజ‌కీయ నేప‌థ్య‌మున్న చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు క‌థ రూపొందిస్తున్న‌ట్టు ఇండ‌స్ర్టీలో అందుతున్న స‌మాచారం. 
ఈ మ‌ధ్య ముంబై నుంచి హైద‌రాబాద్ మ‌కాం మార్చి వ‌ర్మ వీలైనంత వ‌ర‌కు తెలుగు రాజ‌కీయాల‌వైపు దృష్టి సారిస్తున్నాడు. అడ‌పా ద‌డ‌పా త‌న‌దైన సెటైర్లు విసురుతునే ఉన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన  ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని పోలి ఉన్న పాత్ర పెట్టిన వ‌ర్మ‌, మ‌రోమారు ప‌వ‌న్‌పై మ‌రో సెటైరిక‌ల్ మువీ చేసేందుకు సిద్ద‌మవుతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు ముప్పావ‌లా క‌థ అన్న టైటిల్ ఖ‌రారు చేసాడ‌ట వ‌ర్మ‌. ఈ టైటిల్ ఎవ‌ర్ని ఉద్దేశించి పెట్టాడో ఇట్టే అర్ధం అవుతోంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.