రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగారంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దర్శకుడు వీర గనమాల స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఏప్రిల్ 28 ఏం జరిగింది. ఆసక్తిని కలిగించే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం టీజర్ ఇటీవ‌ల విడుద‌లై ప్రేక్షకుల్లోమరింత ఉత్కంఠను రేపుతోంది. సామాజికి మీడియాలో ఈ సినిమాపై చ‌ర్చ ఆరంభం కావ‌టం విశేషం.

కాగా ఈ అంశంపై చిత్ర‌ దర్శకుడు వీర గనమాల చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్న కథతో, అంచనా వేయలేని , అస‌లు ఊహించ‌లేని అనేక ట్విస్ట్‌లతో అనుక్షణం ఉత్కంఠ భ‌రితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్టు చెప్పారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే ప్రాణంగా నిలుస్తుంది. అదే ప్రధానంగా కొనసాగుతుంది ఈ చిత్రంలో . ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వ‌చ్చింది. ర‌షెష్ చూస్తున్న‌ప్పుడు మేమే ఆశ్చ‌ర్య పోయాం. వైవిధ్యాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రానికి కూడా విజయాన్ని అందిస్తారని నమ్ముతున్నాన‌ని అన్నారు .

త్వరలో బ్యాంకాంక్‌లో జరిగే పాట చిత్రీకరణతో సినిమా అంతా పూర్తవుతుంది. అజయ్, రాజీవ్‌కనకాల, తనికెళ్లభరణి, చమ్మక్‌చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని వీర గనమాల తెలిపారు.


Leave a Reply

Your email address will not be published.