ఆర్కా మీడియా వర్క్స్‌ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’

బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. మలయాళం లోవిజయం సాధించిన ‘మహేశింతే ప్రతీకారం’ సినిమాఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘c/o కంచరపాలెం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్‌ మహ ఈ సినిమాకు దర్శకుడు కావ‌టం ఓ విశేషం.

సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. విలక్షణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ చిత్ర టీజ‌ర్‌ని ఈ నెల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు వెంక‌టేశ్ మ‌హా మీడియాకు చెప్పారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా కు సంబంధించి అన్ని ప‌నులు పూర్త‌వుతున్నాయ‌ని ఈ చిత్రాన్ని 2020, ఏప్రిల్‌ 17న విడుదల చేయనున్నట్టు తెలిపారు.


Leave a Reply

Your email address will not be published.