‘అల వైకుంఠపురంలో’ సెన్సార్ పూర్తి

మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతాఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు శుక్ర‌వారం పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ ని అంద‌చేసారు. 
ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.   పాటలు ప్రాచుర్యం పొందిన సందర్భంగా జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ”అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను ”  జరుపుతున్నట్లు నిర్మాత‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.