ఇంత‌కీ జ‌గ‌న్ మంచి సిఎం అయ్యాడా?

ఆరు నెలలలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానంటూ ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున చెప్పారు. ఇందుకు అనుగుణంగా అడుగులూ క‌దిపాడు. అయితే  ఏపీలో వైసీపీ అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు గడిచిపోయింది.  ఈ ఆరు నెలలలో జగన్ పాలనపై ప్ర‌జ‌ల‌ను అడిగితే   భిన్నాభిప్రాయాలు చెపుతున్నారు. పాలన పర్వాలేదని కొంద‌రు చెపుతుంటే,  అనాలోచిత నిర్ణయాల వలన ఏపీ అభివృద్ధి ప‌డ‌కేసింద‌ని కొంద‌రంటున్నారు. భ‌విష్య‌త‌రాల‌కు వార‌ధిగా ఉండా ల్సింది పోయి, అప్ప‌నంగా మంది జ‌నాల‌కు పంచేందుకు ప్ర‌భుత్వ భూములు అమ్మేదామ‌ను కోవ‌ట‌ మేంట‌ని మ‌రికొంద‌రు మండి ప‌డుతున్నారు. అస‌లు మంత్రులు, ముఖ్య‌మంత్రి ఉన్నారా  రాష్ట్రంలో అనే విధంగా పాల‌న‌సాగింద‌ని అన్ని విధాలా రాష్ట్ర‌ వెనకబడి పోతుండ‌టం ఆందోళ‌న క‌ర‌మైన విష‌య‌మ‌ని ఇది వైసిపి నేత‌ల నిర్వాక‌మేన‌ని ఆరోపిస్తున్నారు.

మ‌రోవైపు మ‌ద్య నిషేద‌మంటూనే వైసిపి నేత‌లు రాత్రుళ్లు మ‌ద్యం అధిక‌ద‌ర‌ల‌కు అమ్ముకుంటున్నా ర‌ని, ఇసుక దందాల‌కు చోటు లేదంటూనే దందాలు చేసే నేత‌ల‌కు ప్ర‌భుత్వం, అధికారులు అండ‌గా నిలుస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇక ఎలాంటి ముంద‌స్తు చ‌ర్య‌లు లేకుండా, ఉపాధ్యా యుల‌కు త‌గిన శిక్ష‌ణ ఇవ్వ‌టం కానీ, కొత్త నియామ‌కాలు చేయ‌టం కానీ చేయ‌కుండా ఇంగ్లీష్ మాద్య‌మం ప్ర‌వేశ పెట్టి తెలుగు పాఠ‌శాల‌లు ఎత్తేయాల‌ను కోవ‌టం పైనా వ‌స్తున్న విమ‌ర్శ‌లు అన్నీ ఇన్నీ కావని అలాంట‌ప్పుడు మంచి ముఖ్య‌మంత్రి అని ఎలా అంటామంటున్నారు మ‌రికొంద‌రు.

Leave a Reply

Your email address will not be published.