సిస్టర్స్ ‘టాప్ సీక్రెట్’ లీక్

ప్రియాంక చోప్రా పరిణీతి చోప్రా సిస్టర్స్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక చోప్రా విదేశీ ప్రేమికుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికాలో స్థిరపడుతోంది. ఈ పెళ్లి ఆద్యంతం పారి (పరిణీతి) హంగామా గురించి తెలిసిందే. బావ నిక్ జోనాస్‌ని ఈ భామ బాగానే ఏడిపించింది. ఇక అందచందాల్లోనూ పారి అక్కతో పోటీపడుతోంది. ఇక ఈ సిస్టర్స్ ఇంత అందాన్ని ఎలా మెయింటెయిన్ చేయగలరు? అంటూ ఇటీవలే పీసీ మాతృమూర్తి మధు చోప్రాకు ఓ ప్రశ్న ఎదురైందిట.  ప్రియాంక చోప్రా తనని తాను మిస్ యూనివర్సల్, గ్లోబల్ స్టార్‌గా ఆవిష్కరించుకునేందుకు అందం, ఆరోగ్య ం పరంగా ఎంతో జాగ్రత్త తీసుకుంది. అందుకు కారణం వయసు 30 దాటినా ఇప్పటికీ చిన్ననాటి నుంచి ఉన్న కొన్ని అలవాట్లను కొనసాగిస్తోంది. నిరంతర వ్యాయామం, యోగాతో పాటు ఆహారం ఎంతో ముఖ్యం. ఇందులో పప్పు దినుసులతో పాటు, బాదం, నట్స్ వంటివి తినడం మితాహారం కారణమని.. సిస్టర్స్‌కి సంబంధించిన టాప్ సీక్రెట్ లీక్ చేశారు. ఆందం, ఆరోగ్యాన్ని కాపాడే పుష్కలమైన లక్షణాలు బాదాం పప్పులో ఉన్నాయి. సుగర్ వ్యాధుల్ని, గుండె జబ్బుల్ని నివారించే గుణాలు ఆల్మ ండ్స్ బాదంలో ఉన్నాయి…పీసీ వాటిని విరివిగా తీసుకుంటుంది. ఈ అలవాటు చిన్నప్పటి నుంచి నాకు కూడా ఉంది. దానిని పీసీ  పరిణీతి అనుసరిస్తారని మధు చోప్రా తెలిపారు.  పరిణీతి ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన కేసరి అనే చిత్రంలో నటిస్తోంది. సందీప్ ఔర్ పింకీ ఫరార్, జబారియా జోడి వంటి చిత్రల్లోనూ నాయికగా నటిస్తోంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ఏ కిడ్ లైక్ జేక్ చిత్రంలో నటిస్తోంది. తాజాగా అక్కచెల్లెళ్లు ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోని పరిణీతి స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.