నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్‌ని వ‌ద‌ల‌డానికి కార‌ణాలు ఇవేనా…?


బుల్లి తెర షోల‌లో మంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చిన షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. ఆ షో వ‌ల్ల ఈటీవీ టిఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింద‌నే చెప్పాలి. ఇక ఈ షోకి నాగ‌బాబు, రోజా జ‌డ్జిల‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, అన‌సూయ‌, రేష్మి యాంక‌ర్లుగా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటారు. ఈ షోలో వ‌చ్చే క‌మెడియ‌న్స్ అంద‌రికీ దాదాపుగా మంచి పేరు వ‌చ్చి ప్ర‌స్తుతం సినిమాల్లో కూడా న‌టించేస్తున్నారు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్ర‌తీ సినిమాలోనూ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లే ఎక్కువ‌గా ఉంటున్నారు. అంతే వాళ్ళ టాలెంట్ ఏవిధంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఈ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటపడిన నాటి నుంచి యూట్యూబ్-మీడియా వేదికలపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శ్యామ్ ప్రసాదరెడ్డి నిర్మించిన ఈ షో చాలా మందిని వెలుగులోకి తీసుకురావడమే కాకుండా చాలా మంది జీవితాల్ని సమూలంగా మార్చేసింది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు… పెద్ద అస్సెట్ అన్న కథనాలు వచ్చాయి. నాగబాబు- నటి రోజా  న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి దీనిని పెద్ద సక్సెస్ చేశారు. అయితే ఇటీవల ఈ షో నుంచి ఆర్థిక లావాదేవీలు సహా పాలసీ పరమైన విభేదాల కారణంగా మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్నారని కథనాలొచ్చాయి.

అయితే ఈ షో నుంచి తప్పుకున్న నాగబాబు జీటీవీతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట. జీ తెలుగు ఛానల్ కోసం ఆయన జబర్దస్త్ తరహా కామెడీ షోని ఈ మధ్యనే  అక్క‌డ కూడా మొదలుపెట్టారు. ఇందుకు గాను జీటీవీ వాళ్లనుంచి ప్రతి నెలా 30 లక్షలు దాంతో పాటే అదనంగా ప్యాకేజీ కూడా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. షూటింగ్ సమయంలో ఆయ‌న‌కు ప్రత్యేకంగా కారవాన్.. సెలబ్రిటీ ట్రీట్ ని నాగబాబు పొందుతున్నారన్నది తాజా  అందిన వార్త‌.

అయితే గ‌తంలో ఈటీలో జ‌బ‌ర్ద‌స్త్ షోకి ఆయ‌న కేవ‌లం 20 ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకునేవార‌ని దానికి 10 లక్షలు అదనంగా కలుపుకుని 30లక్షల వరకూ జీటీవీ నుంచి వస్తుండటం వల్లనే మెగా బ్రదర్ షిఫ్ట్ అయ్యారట. అంతేకాక‌… ఇప్పుడు తీసుకుంటున్న దాని కంటే మ‌రింత అద‌న‌పు ప్యాకేజీని రెండేళ్ళ కొక‌సారి పెంచేందుకు ఆయ‌న కాంట్రాక్ట్ కుదుర్చుకున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే మెగా బ్ర‌ద‌ర్ వెళ్ళ‌డానికి ముఖ్య కార‌ణం ప్యాకేజీ మాత్ర‌మేనా లేదా ఇంకేదైనా కార‌ణాలు ఉన్నాయా అన్న‌ది ఎవ్వ‌రికీ అర్ధం కాని ప్ర‌శ్న‌గా మిగిలింది.


Leave a Reply

Your email address will not be published.