హాకీ క్రీడాకారిణిగా లావణ్యా త్రిపాఠి

అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో కనిపించే లావణ్యా త్రిపాఠి ని వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.
తాజాగా సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ప్రెస్’ హాకీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా నటిస్తుండటంతో. క్యారెక్టర్లో మరింత ఇన్వాల్శ్ అయ్యేందుకు ఒ కోచ్ పర్యవేక్షణలో కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరో సినిమా షూటింగు తో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం హాకీ శిక్షణకు డుమ్మా కొట్టకుండా ప్రాక్టీస్ చేస్తోందట.
ప్రస్తుతం ఒక తమిళ సినిమా కూడా నటిస్తున్నలావణ్యా త్రిపాఠి వారం రోజులుగా ఉదయం చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ లో పాల్గొన్నా, రాత్రి ఫ్లయిట్ పట్టుకుని హైదరాబాద్ వచ్చేసి, రెండు మూడు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని తెల్లవారగానే మళ్లీ హాకీ ప్రాక్టీస్ చేసి, తిరిగి చెన్నై వెళ్లి షూటింగ్ లో పాల్గొనటం చూస్తుంటే అమ్మడు ఈ పాత్రపై చాలా శ్రద్ధపెట్టిందని చెపుతున్నారు.
‘ఏ1 ఎక్స్ప్రెస్’ తాజా షెడ్యూల్ ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక లావణ్యా త్రిపాఠి హాకీ పార్టు మరి రెండు మూడు రోజులలో ఆరంభమవుతుందని సమాచారం.