అభ‌య్ డియోల్ తొలి సారి ద‌క్షిణాది చిత్రంలో

`అభిమ‌న్యుడు` చిత్రంతో స‌త్తా చాటిన   పి.య‌స్‌. మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో  తాజాగా  డైనమిక్ స్టార్ శివ కార్తికేయ‌న్ హీరోగా త‌మిళంలో చేసిన చిత్రం `హీరో`. ఈ చిత్రాన్ని   కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `శ‌క్తి` పేరుతో అందిస్తున్నారు  నిర్మాతకోటపాడి జె రాజేష్ . యాక్షన్ కింగ్‌ అర్జున్ కీల‌క పాత్రధారి గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అభ‌య్ డియోల్ ద‌క్షిణాది చిత్రంలో తొలి సారి న‌టించారు. 
విద్యావ్య‌వ‌స్థ వ‌చ్చిన‌ జెంటిల్‌మేన్  చిత్రానికి  ఏమాత్రం తీసిపోని క‌థ‌తో `శ‌క్తి` ఉంటుంద‌ని డైర‌క్ట‌ర్ పి.య‌స్‌.మిత్ర‌న్ చెప్పారు. ఈ చిత్ర విడుద‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న   శక్తిమాన్ సీరియ‌ల్ ప్రభావంతో సూప‌ర్‌మేన్ అవుదామ‌నుకున్న ఓ అబ్బాయి… రియ‌ల్ లైఫ్‌లో చేసిన స్టంట్‌లు ఏంటి?  సూప‌ర్ మేన్ త‌ర‌హా ప‌నులేంటి? మ‌న విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను   బాగు చేసేందుకు ఏం చేసాడ‌న్న విష‌యాల‌ను  ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాన‌ని,  త‌మిళంలో ఇప్ప‌టికే హిట్ టాక్ తెచ్చుకున్న  యూనివర్సల్ స‌బ్జెక్ట్ మువీ  తెలుగు ప్రేక్ష‌కులును ఆక‌ట్టుకుంటుంద‌ని అన్నారు.   వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ సినిమా  ఆనందాన్ని, ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంద‌ని అన్నారు ద‌ర్శ‌కుడు.  
ఈ సంద‌ర్భంగా  నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ “ శివ కార్తికేయ‌న్ సినిమా అంటేనే క‌థ‌లో క‌చ్చితంగా ఏదో  చ‌ర్చించుకునే పాయింట్ ఉంటుంది.  అందుకే సినిమా సినిమాకూ ఆయ‌న మార్కెట్ పెరుగుతూ ఉందద‌ని అన్నారు. ఆయ‌న న‌టించే `హీరో` మూవీ యూనివ‌ర్శ‌ల్ స‌బ్జెక్ట్  కాంటంతో  తెలుగులో `శ‌క్తి` పేరుతో విడుద‌ల చేస్తున్నాం.అని చెప్పారు.  సంగీతద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా, ఎడిట‌ర్ రూబెన్‌, సినిమాటోగ్రాఫ‌ర్ జార్జి.జి.విలియ‌మ్స్ ఈ చిత్రానికి  అందించిన సేవ‌లు అద్భుత‌మ‌ని, పినిమాలో ఉన్న డైలాగులు అంద‌రినీ ఆలోచ‌న‌లో ప‌డేస్తాయి.  అని ఆన్నారు. . త్వ‌ర‌లోనే సెన్సార్  ప‌నుల‌ను పూర్తిచేసి,  ఈ నెల్లోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని, త్వ‌ర‌లోనే , సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని చెప్పారు..

Leave a Reply

Your email address will not be published.