సభ్యసమాజం లో రోజురోజుకి పెరిగిపోతున్న అత్యచారాలు….

చిన్న పెద్ద అని తేడా లేకుండా కామాంధుల చేతులలో ఆడవారు బలైపోతున్నారు. ఇలాంటి కామాందులలో మార్పుతీసుకురావడం కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన రోజు ఏదొక చోట చిన్నారులు, యువతులు కామాంధుల బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మహిళలు ఒంటరిగా రోడ్ల మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. అంతే కాకుండా ఇలాంటి అఘాయిత్యాల భారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు జీవచ్ఛవాలుగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలులో జరిగిన ఓ దారుణ సంఘటన అక్కడి ప్రాంతంలో కలకలం రేపింది. 

వివరాల్లోకెళితే… స్థానిక జిల్లాలోని కేశవరాజు కుంట శివారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో వివస్త్రగా పడి ఉండడం గమనించిన   స్థానికులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించారు. దాంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి ప్రాంతాన్ని పరిశీలించగా ఆమె పక్కనే లో దుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడి ఉన్నాయి. దీనితో పోలీసులు మహిళపై గ్యాంగ్ రేప్ జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో సదరు మహిళ కొన ఊపిరితో ఉండటంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

ఇక ఆ మహిళ ఎవరు.? బాధితురాలికి తెలిసిన వారే శివారు ప్రాంతానికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డారా.? లేక మహిళను కిడ్నాప్ చేసి అనంతరం దారుణానికి ఒడిగట్టారా.? అన్నది తేలాల్సి ఉండగా సదరు మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు చేసేందుకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అటు మహిళ గొంతులో దుండగులు బియ్యం గింజలు పోసినట్టు డాక్టర్లు గుర్తించారు… కడుపులో, ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు లభ్యమైనట్లు సమాచారం. కాగా, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published.