అనుష్క భాగ‌మ‌తి హిందీలో…ఎవ‌రు చేస్తున్నారంటే…?


‘భాగమతి’ హిందీ రీమేక్ కి సన్నాహాలు చేస్తున్నారు . తెలుగులో విజయాన్ని సాధించిన ‘భాగమతి హిందీలో టైటిల్ గా ‘దుర్గావతి గాను, ప్రధాన పాత్రధారిగా  భూమిఫ‌డ్నేకర్ గాను తెలుగు భాగమతి దర్శకుడు అశోక్ అనుకుంటున్నారు.  ఏడాది క్రితం ఆరంభంలో వచ్చిన ‘భాగమతి’ భారీ విజయాన్ని నమోదు చేసింది. అనుష్క ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ సినిమా, ఆమె కెరియర్‌లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో నిలిచింది. దర్శకుడిగా అశోక్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు ఆయన ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో అనుష్క చేసిన పాత్రకిగాను ఆయన హిందీలో భూమిఫ‌డ్నేకర్ ను తీసుకున్నారు. అక్షయ్ కుమార్ తో కలిసి ఈ సినిమాను టి.సిరీస్ వారు నిర్మిస్తున్నారు. హిందీ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కథలో అశోక్ కొన్ని మార్పులు చేశాడట. ఈ రీమేక్ కి ‘దుర్గావతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం.

 భూమి పెడ్నేకర్. విభిన్నమైన కాన్‌సెప్ట్స్‌ ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకున్న భూమికి ఫ్యాన్స్ ఎక్కువే. ఈ నేపథ్యంలో కఫీర్ సౌరభ్ అనే నెటిజన్.. భూమికి ప్రపోజ్ చేశాడు.  ఈ ట్వీట్ చూసిన భూమి చాలా స్వీట్‌గా రిప్లై ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.