ఉగాది కానుకగా ‘ఒరేయ్ బుజ్జిగా…`

శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా…` శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నఈ యూత్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25 విడుదలచేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఈ చిత్రం కోసం సరి కొత్త తరహా లో మొబైల్ పబ్లిసిటి అనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు చిత్ర నిర్మాత. ఇందుకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలు రూపొందించారు. ఇవి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో తిరుగుతు సినిమా గురించి ప్రచారం చేస్తాయి.
ఈ వాహనాలను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది. ఉగాది కానుకగా వస్తున్న ఈ సినిమా కోసం మొబైల్ పబ్లిసిటి అనే నూతన టెక్నాలజీ కి అంకురార్పణ చేయటం బాగుంది. ఇది ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగకరమైనది అని అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె రాధామోహన్ , దర్శకుడు కొండా విజయ్ కుమార్, రాజ్ తరుణ్, మాళవిక నాయర్, జె మీడియా నరేందర్ తదితరులు మాట్లాడారు.