పృధ్వీ నోటి దూ…… కి ప‌ద‌వి ఊడింది

నోరా… వీపుకు తేకే…. అన్న తెలుగు సామెత ఖ‌చ్చితంగా  ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కి వ‌ర్తిస్తుంది. రాజ‌ధాని రైతులు పెయిడ్ ఆర్టిస్టులని, వాళ్లంతా త‌న‌తో న‌టించిన వాళ్లేనంటూ పృధ్వీ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేప‌టంతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ మ‌హిళా ఉద్యోగినితో ఆయ‌న స‌రస సంభాష‌ణ‌లు బైట‌కు రావ‌టంతో పృథ్వీపై వేటు వేయాలని వైసిపి అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించి ఈ మేర‌కు టీటీడీ కి తెలియ‌జేయ‌టంతో  త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలని పృథ్వీకి టీటీడీ అధికారులు ఆదేశాలిచ్చారు
అయితే త‌న రాజీనామా విష‌యంపై పృధ్వీ మీడియాకు ఓ  ఆడియో స‌మాచారం పంపారు. దీనిలో  కొంద‌రు దురుద్దేశాల‌తో నామీద  లేనిపోనివి క‌ల్పించి మాట్లాడారు. రైతు కష్టాల గురించి నాకు తెలుసు. నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నా. పోసాని కృష్ణమురళితో త‌న‌కు వ‌చ్చిన విభేదాలు సాధార‌ణ‌మైన‌వేన‌ని వాటిని విప‌క్షాలు ఉపయోగించుకుని రాద్ధాంతం చేస్తున్నార‌ని, ప‌విత్రం ప‌ద్మావ‌తి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించడం, అక్ర‌మంగా ఉద్యోగాలు ఇచ్చాన‌న్న‌ ఆరోపణలు నిరాధారమ‌ని చెప్పారారయ‌న‌.  మొత్తానికి థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే  పృధ్వీకి ప‌ద‌వి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలింద‌ని కొంద‌రంటే…. నోటి దూ…. దెబ్బ‌కి ప‌ద‌వి ఊడింద‌న్న‌ సెటైర్లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.