మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నివాళి….

నడిచే నట విశ్వ విద్యాలయం ఆయన , ఎన్ని బిరుదులొచ్చిన నటసామ్రాట్ ని మించినది కాదనన్న వ్యక్తి. తలచే 75 ఏళ్ళు తెలుగు కళామతల్లి ఒడిలోనే గడిపిన ఏకైక వ్యక్తి నేటితరం నటులకు ఆయన నట పాఠ్య పుస్తకం. తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేకత నిలుపుకుంటూ వచ్చిన ఆయనే ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు.
నేడు జనవరి 22న ఆయన 6వ వర్ధంతి జరుపుకుంటోంది సినీ ఇండస్ట్రీ. వ్యక్తిగా ఆయన మన మధ్యలేక పోయినా ఎన్నో అజరామర చిత్రాలను అందించిన ఘనత ఆయనదే. తెలుగు సినిమాకు బాలరాజు,.బాలచంద్రుడు,కాళిదాసు, .దేవదాసు, క్షేత్రయ్య , కబీరు , అర్జునుడు, అభిమన్యుడు, ఇలా అనేక కీలక పాత్రలతో చారిత్రక పురుషుడుగా నిలచిన భక్తవరేణ్యుడు… జానపద కథా నాయకుడు… అమర ప్రేమికుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో బహుదూరపు బాటసారి అని చెప్పక తప్పదు నేడు ఆ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా మా నివాళి.