దాసరి పాత్ర చిరంజీవి పోషిస్తారా…?టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా.మారిపోతున్న‌ర‌న‌టంలో సందేహ‌మే అవ‌స‌రం లేద‌ని అన్నారు  సినీ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ధ్వాజ‌. శుక్ర‌వారం ఆయ‌న త‌న కార్యాల‌యంలో కాసేపు మీడియాలో ముచ్చ‌టిస్తూ. . పెద్దన్న ఉంటూ దివంగత నేత. దర్శకుడు దాసరి నారాయణ ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినా పరిష్కార మార్గాలు  చూపించార‌ని,  ఆయన మరణాంతరం  ఇప్ప‌డు  ఇలాంటి పనులన్నీ చిరంజీవి త‌ల‌కెత్తుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అన్నారు. 

ఆయనకు ప్రభుత్వం అందించే నంది అవార్డుల కమిటీకి చైర్మన్‌ పదవి ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని.. వార్త‌లొస్తున్నాయ‌ని, ఇలాంటి చిన్న ప‌ద‌వులు ఆత‌నికి అవ‌స‌రం ఉంటుంద‌ని నేన‌నుకోవ‌టం లేద‌ని అన్నారు.. ఆయన అవార్డు  చైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీక‌రిస్తే… తాను అస్సలు అంగీక‌రించ‌న‌ని, అన్నారాయ‌న‌. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం సినిమాలో అంద‌రికీ కావ‌ల్సిన వ్య‌క్తిగా చిరంజీవి ఉండాల‌ని కోరుకునే వ్య‌క్తిని నేన‌ని, అవార్డుల విష‌యంలో ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా దాని ఫ‌లితం చిరంజీవిపై ప‌డ‌కూడ‌ద‌నే త‌ను చెపుతున్నాన‌ని చెప్పారు భ‌ర‌ధ్వాజ‌.

 ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’, ‘మా’లో విబేధాలతో పలు విషయాల్లో గొడవలు జరిగినప్పటికీ పైకి చిరు పేరు రాకున్నప్పటికీ అన్ని సమస్యలను ఆయనే పరిష్కరించారన్న‌ది వాస్త‌వ‌మేన‌ని, మంచి పేరు తెచ్చుకున్న ఆత‌నికి అప‌కీర్తి రాకూడ‌ద‌ని అన్నారాయ‌న‌.  
మా’లో విబేధాల గురించి మీడియా వాళ్లు ఏదే జరిగిపోయిందని రాసేస్తున్నారని.. త‌మ అంత‌ర్గ‌త  సమస్యలని ప‌రిష్క‌రించు కోగ‌ల‌మ‌ని, అయితే వాటిని బూత‌ద్దంలో చూపించ‌డ‌మేంట‌ని మీడియాపై ఒకింత ఆగ్రహాన్ని వ్య‌క్తం చేసారు  ఇండస్ట్రీకి సుప్రీం  మెగాస్టార్ చిర‌జీవేన‌ని,  ఆయన ఏదైనా సరే చేయగలిగే స్థాయిలో ఉన్నారని, ఇందుకు ప‌ద‌వులే అఖ్ఖ‌ర్లేద‌ని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published.