ఇన్‌సైడర్ ట్రేడింగ్ లో జ‌గ‌నే తొలిముద్దాయి

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ గ‌గ్గోలు పెడుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య రాజధాని కూతవేట దూరంలో భూములు ఎలా కొనుగోలు చేశారో చెప్పాల‌ని నిల‌దీసారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. శ‌నివారం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ రాజ‌ధాని ఏర్ప‌డ‌క ముందు, అస‌లు రాష్ట్ర‌మే విడిపోక ముందు కొన్న భూముల్ని, ప్ర‌భుత్వాలిచ్చిన భూముల్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ చెపుతున్న వైసీపీ నేతలు సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని, మ‌ని భార‌తి కొనుగోలు చేసిన భూములు ఇందులోకి రావా? అని  ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.

 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జ‌గ‌న్ ఇదే రకమైన ఆరోపణలు చేసార‌ని,  దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కానీ తాము అధికారంలోకి వ‌చ్చాక విచార‌ణ‌లంటూ క‌మిటీలు అంటూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం భావిస్తే… అందులో తొలి ముద్దాయి సీఎం జగన్ అవుతారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తాడేపల్లి పరిధిలో సీఎం జగన్ బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అలాగే వైసిపికి చెందిన ప‌లువురు భూములందుకున్న దాఖ‌లాలు ఉన్నాయ‌ని, అన్నిటికి ఆధారాల‌తోనే మేం మాట్లాడుతున్నామ‌న్నారు.  మేం తప్పు చేసినట్టు భావిస్తే న‌చ్చిన సంస్ధ‌తో విచారణ చేయించుకోవాల‌ని, దాన్ని సాకుగా చూపి రైతులను బలిపశువులను చేయొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.Leave a Reply

Your email address will not be published.