అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా..

‘ఒక మనసు’ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది మెగా ప్రిన్సెస్ నిహారిక. తాజాగా.. సూర్యకాంతం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  బి. ప్రణీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక సోదరుడు వరుణ్‌తేజ్ సినిమాను సమర్పిస్తున్నారు. అలాగే సందీప్ ఎర్రంరెడ్డి, రామ్ నరేష్, సృజన్ ఎర్రబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బాబాయ్ పాటకు నిహారిక స్టెప్పులేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమాలోని “అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా..” పాటకు నిహారిక డ్యాన్స్ చేసింది. ఈ సరదా సంఘటన సూర్యకాంతం సెట్లో జరిగింది. ఈ పాటకు నిహారికతో పాటు సీనియర్ నటి సుహాసిని స్టెప్పు కలిపారు. ఈ పాటకు వీళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published.