మరొకసారి బి గోపాల్, బాలయ్య కాంబినేషన్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ తన 106వ చిత్రం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ఆరంభించిన విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల సన్సేషనల్ హిట్ల తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా అందులో ఓ పాత్ర అఘోరాగా వినవస్తుండటంతో ప్రేక్షకులలోనూ ఈ చిత్రంపై అనేక ఆశలున్నాయి. ఫ్యాన్స్అయితే హేట్రిక్ విజయం అందుకుంటామని ధీమాగా ఉన్నాయి.
ఓ వైపు ఈ సినిమా సెట్స్ పై సందడి చేస్తుంటే బాలయ్య తన తదుపరి 107వ చిత్రం సినిమాపై ఫోకస్ పెట్టేసి, ఆ బాధ్యతలని సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కి అప్పగించాడని తెలుస్తోంది. బాలకృష్ణతో లారీ డ్రైవర్, రౌడీఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన బి.గోపాల్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ సినిమా కు సంబంధించి వివరాలను అధికారిక ంగా వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్లో బోయపాటి శ్రీను సినిమా పూర్తి అయిన వెను వెంటనే బాలయ్య మే నెలలోనే తన 107వ సినిమాను లైన్లోకి తీసుకువస్తాడని ఓ గుసగుస.