ఫ్యామిలీతో అమెరికా వెళ్తున్న సూపర్‌స్టార్ ఫామిలీ …

ఈ సంక్రాంతికి `సరిలేరునీకెవ్వరు`తో ప్రేక్షకుల ముందు సందడి చేసిన సూపర్‌స్టార్ మహేశ్ తన భార్య నమ్రత, గౌతమ్, సితారలతో అమెరికాకు ఫ్లైట్ ఎక్కేశారు. ఫ్యామిలీతో సహా అమెరికా వెళుతుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీసిన ఫొటోలను నమత్ర తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మేం వెళ్తున్నాం, హ్యాపీహాలీడేస్, బ్లాక్‌బస్టర్ కా బాప్, సరిలేరు నీకెవ్వరు అనే పదాల హ్యాష్ ట్యాగ్‌లకు కూడా జత చేయటంలో సామాజిక మీడియాలో ఈ ఫోటోలు ట్రోల్ అవుతున్నాయి.
సినిమా షూటింగ్‌ల నుండి ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో విదేశాలలో సేద తీరే మహేష్ `సరిలేరునీకెవ్వరు` సినిమా కోసం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగులో పాల్గొన్నవిషయం విదితమే. ఈ సినిమా విడుదలైన ప్రమోషన్స్ కూడా పూర్తి కాగానే ఈ లాంగ్ వెకేషన్ కు ఫ్యామిలీ మొత్తం వెళ్లింది. వీరితో పాటు మెహర్ రమేష్ కూడా వెళ్లడం విశేషం. ఈ వెకేషన్ రెండు నెలలు పాటు సాగుతుందని వార్తలు వినపడుతున్నాయి. అటునుంచి రాగానే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్ .