ట్రంప్ కన్నా నైట్ ఈవెంట్ బెటర్ : వర్మ ట్వీట్లు

ట్రంప్ పర్యటన నేపధ్యంలో జరిగిన ర్యాలీలో అడుగడుగునా ఆతనికి స్వాగతం పలికేందుకు పెద్ద పెద్ద హోర్డింగులు, ప్లకార్డులుతో అహ్మదాబాద్ పట్టణం మునిగి పోయింది. మరోవైపు ట్రంప్ దంపతులు పాల్గొనే వల్లభాయ్ పటేల్ స్టేజియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టేజీల పై భారత్‌కు విచ్చేసిన ట్రంప్ కుటుంబానికి స్వాగతం పలుకుతూ సినీ తారలతోనూ, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలచే పలు శాస్త్రీయ నృత్యాలను అధికారులు ఏర్పాటు చేశారు . ట్రంప్ ఏదారిలో వెళ్లినా అమెరికా, ఇండియా జెండాలను పట్టుకుని ట్రంప్ కు స్వాగతం పలికేలా భారీగానే జనాలను మోహరించారు.
ఇంత అట్టహాసంగా సాగుతున్న ఏర్పాట్లపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇన్ని ఏర్పాట్లకు నిధులు ఎక్కడ నుంచి ఏర్పాటు చేసారని నిలదీసారు. దీనికి అధికార పక్షం నుంచి ప్రస్తుతానికి సమాధానం లేదు. బహుశా ట్రంప్ ఉన్నంత కాలం మౌనంగా ఉండాలనుకున్నారనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ టూర్ పై మరోసారి వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మవర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ అహ్మదాబాద్ లో తనకు కోటి మంది స్వాగతం పలుకుతారంటూ ట్రంప్ చేసిన వ్యాఖలను ఉద్దేశిస్తూ, అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, సన్నీ లియోన్ ఇలా అందరినీ కలుపుకుని ట్రంప్ వస్తే అప్పుడు కోటి మంది వస్తారేమో అని తన ట్విట్టర్ ఖాతాలో సెటైర్ వేశాడు. ట్రంప్‌ను ఆహ్వానించడానికి మనం వేలకోట్లు ఖర్చు చేశాం కానీ ప్రధాని మోడీని అమెరికాలో స్వాగతించడానికి ఎన్ని డాలర్లు ఖర్చు చేస్తారంటూ ప్రశ్నించారు.
అసలు ట్రంప్ ను ఎవరు చూసేందుకు వస్తారు… దీని కంటే ఓ బాలీవుడ్ నైట్ ఈవెంట్ ఏర్పాటు చేయడం మంచిది అని వర్మ ఎద్దేవా చేశారు. కేవలం తన కోసం 10 మిలియన్ల మంది వస్తే ట్రంప్ 15 మిలియన్ల జనాలు వచ్చారని అబద్ధం చెబుతాడు, ఇది తను చనిపోయేవరకు గొప్పలు చెప్పుకోవటానికే ఉపయోగపడుతుంది అంటూ ట్వీట్ చేశాడు వర్మ.