అభిమానులు ఆదరించని “డిస్కో రాజా”

కొన్నేళ్లుగా మాస్ మహారాజ రవితేజ సరైన విజయాలు అందుకోవడం లేదు. ఎన్ని చిత్రాలు చేసిన ప్రేక్షకులు ఆదరించకపోవడంతో  ప్రయోగానికి సిద్ధపడుతూ తీసిన చిత్రం “డిస్కో రాజా” ఈసినిమాతో రవితేజ మరోసారి కూడా భారీ విజయాన్ని అందుకోలేక పోయాడు. ఈసినిమాను వీఐ ఆనంద్ స్కైఫై థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించారు. ఈసినిమాలో కథానాయికలుగా నభా నటేష్‌, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ నటించారు. అయినా వీరికి కూడా ఈ సినిమాలో ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. కేవలం అందాల అరబోతకే పరిమితమయ్యారు. 
 ఈచిత్రాన్ని అభిమానులు కూడా ఆదరించడం లేదు. దీనికి తోడు రిఫ్యూస్ చాలా దారుణంగా వచ్చాయి. దీంతో రవితేజ బాగా హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. నిన్న జరిగిన విజయోత్సవ సభలో రవితేజ చివరి వరకు  ఉండకుండా  మధ్యలోనే వెళ్లిపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో పలు పుకార్లు వైరల్ అవుతున్నాయి. వసూళ్లు కూడా అంతకంతకు తగ్గిపోతున్నాయి. సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాలు ‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అలా.. వైకుంఠపురములో’ చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. ఈ రెండు సినిమాల ప్రభావం “డిస్కో రాజా”  వసూళ్లపై పడింది. 

Leave a Reply

Your email address will not be published.