సుకుమార్ బ‌న్నీ సినిమా కి అన‌సూయ విలన్
బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్   ప్రోగ్రామ్‌తో క్రేజ్ సంపాదించుకుని సినిమాల్లోకి వ‌చ్చిన‌ అన‌సూయ భ‌రద్వాజ్‌ ప‌లు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. గ‌త ఏడాది సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ రంగ‌స్థ‌లంలో రంగ‌మ‌త్త‌గా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న అన‌సూయ తాజాగా    అల్లు అర్జున్‌తో  డైరెక్ట‌ర్ సుకుమార్ చేసే సినిమాలోనూ   కీల‌క పాత్ర పోషించేందుకు ఎంపికైంది.  అయితే ఈ చిత్రంలో అన‌సూయ ప్ర‌తి నాయ‌కురాలి పాత్ర పోషిస్తోంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుప్పుమంటోంది.   
ఇప్ప‌టికే క్ష‌ణం సినిమాలో  అన‌సూయ ప్ర‌తినాయ‌కిగానే న‌టించి అద‌ర‌హో అనిపించుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని   సుకుమార్  బ‌న్నీ సినిమాలో అన‌సూయ కోసం  ఈ పాత్ర‌ను క్రియేట్ చేశాడ‌ని స‌మాచారం.  ప్ర‌స్తుతం అన‌సూయ విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మిస్తోన్న చిత్రంలో  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, క్రిష్ సినిమాలోనూ కీల‌క పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.