పవన్ స్వశక్తి తో పైకొచ్చారు మరి మీరు…. కేసులకు భయపడి ఉద్యమాన్ని ఆపుతామా?

రాజధానిపై , పవన్ కళ్యాణ్‌పై, రాజధాని రైతులపై మంత్రుల వ్యాఖ్యలపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను పవన్ నాయుడు అంటున్నారని, మరి ఈ నానీని నానీ రెడ్డి అని పిలవాలా లేక జోసెఫ్ నానీనా, లేక జాన్ నానీనా? ఏమని పిలవాలి అంటూ సెటైర్లు వేశారు. మచిలీపట్నంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. మాట్లాడేందుకు నోటికి హద్దుండాలని ఈ సందర్భంగా మంత్రులకు హితవు పలికారు. ‘ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్ స్వశక్తితో పైకొచ్చిన వ్యక్తి అయితే, మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేసి పైకొచ్చిన వ్యక్తులు. మీరా మాట్లాడేది?’ అంటూ మండిపడ్డారు.
నేను జోలె పట్టడాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది నా అవసరం కాదు. సమాజం కోసం జోలె పట్టాను. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. స్వార్థం వద్దు. స్వార్థంతో ముందుకెళ్లుంటే మహాత్మాగాంధీ స్వతంత్రయాన్ని సాధించేవాడు కాదు. బ్రిటీష్ వాళ్లకు భయపడి ఉంటే పోరాటం సాగించేవాడు కాదు. ఇప్పటి ప్రభుత్వంలోని పెద్దలు అందివచ్చిన కేసులు అన్ని రైతులపై పెడుతున్నాడు. ఈ కేసులకు భయపడతామా, కేసులకు భయపడి ఉద్యమాన్ని ఆపుతామా?’ అంటూ ప్రసంగించారు. స్పందించకపోతే ఆంధ్రుల భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు. సంపద సృష్టించడం ఎలాగో సీఎం జగన్‌కు ఏం తెలుసా అని నిలదీశారు. సంపద సృష్టించలేడు, నగరాలు నిర్మించలేడు.. డబ్బులు మాత్రం కావాలంటాడని జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.