’సరిలేరు నీకెవ్వరు’ తొలిపాట అదిరిందిగా…

దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ హీరోగా రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. డిశంబర్‌లో ప్రతి సోమవారం ఒక పాట చొప్పున ఐదు పాటలను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించగా మొదటి సోమవారం అయిన డిసెంబర్ 2న సినిమాలోని మాస్ నంబర్ ‘మైండ్ బ్లాక్’ను విడుదల చేశారు.
‘మైండ్ బ్లాక్… మైండ్ బ్లాక్… మైండ్ బ్లాక్.. బాబూ.. నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు’ అంటూ సాగే పాటను శ్రీమణి రచించగా మాస్ నంబర్స్ చేయడంలో సిద్ధహస్తుడైన దేవిశ్రీప్రసాద్ మరోసారి ఈ పాటతో తన మార్క్‌ని చూపించారు
బ్లేజ్, రెనినా రెడ్డి గానం చేసిన ఈ పాటలో మహేష్ వాయిస్ వినిపించడం ఓ స్పెషల్ ఎట్రాక్షన్ . ‘బాబూ నువ్ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’ అని లేడీ సింగర్ అనగా…‘నువ్ కొట్టరా..’ అంటూ పాట మధ్యలో కూడా రెండుసార్లు మహేష్‌బాబు తనదైన శైలిలో చెప్పడం కొత్తగా అనిపించింది.
రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ వ్యూస్ పరంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.