సూసైడ్‌ని ఆలోచింపజేసే సూసైడ్ క్లబ్

కథః
ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే ఆరుగురు వ్యక్తుల కథతో ఈ ఫిలిం రూపొందింది. ఓ వ్యక్తి మిగిలిన ఐదుగురు వ్యక్తులను ఎందుకు చావాలనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో కథ రన్ అవుతుంది. అయితే. ఒక్కొక్కరు తమ కథల్ని వినిపిస్తుంటారు. అందులో హీరోయిన్ ప్రియ భర్తగా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామనీ, తరవాత వేరే హీరోతో ఎఫైర్‌తో నన్ను వదిలేసిందని వెల్లడిస్తాడు. అతను ఎందుకు అలా చేశాడనే క్రమంలో అతని మోటివేటివ్ చేస్తూ ఐదుగురులో ఓ అమ్మాయి తనకు తెలిసిన జ్ఞానంతో చెపుతుంది. అది ఎలా ఏమిటి? అనేది కథ. అసలు సూసైడ్ క్లబ్ ఎందుకు పెట్టాల్సివచ్చిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముందుగా ఇందులో నటించిన ఐదుగురు చావాలనుకుంటారు అనే కథాంశంతో తీసుకెళ్తూ చివరగా చనిపోవడానికి అక్కడకు వచ్చింది ఒక్కరే అన్న ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.
విశ్లేషణః
నిడివి 45 నిముషాలపాటు సాగుతోంది. ఇది హిందీ, తెలుగు భాషలలో నిర్మించారు. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలకు నయం చేశారు. చాలా సింపుల్ కథాంశంతో వున్న ఈ పాత్రలకు ఎవరికి వారు బాగానే నటించారు. అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలనే వారికి ఈ ఫిలిం ఓ క్లారిటీ వుంటుంది. ఒకే లొకేషన్లో ఒకే టైంలో ఆరుగురు వ్యక్తులతో కథను ఆసక్తిగా నడిపించాడు. అయితే ఇది కేవలం ఓ ఎవేర్నెస్ కోసం తీసిందే.. ఆమెజాన్లో ఈ చిత్రంలో చూడవలసింది. దర్శకుడు తనకు తెలిసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తీశానడనే చెప్పాలి. అలాగే ఇందులో నటించిన నటీనటులందరూ చాలా న్యాచరల్‌గా మేకప్ లేకుండా చేశారు.
నటీనటులుః
శివరాంచంద్రవరపు, ప్రవీణ్ ఎండమూరి, చందనా, సందీప్‌రెడ్డి, వెంకటకృష్ణ, సాకేత్సింఘ్ తదితరులు నటించారు. వెంకటకృష్ణ యాక్టింగ్ చాలా అద్భుతంగా ఐదు నిముషాల అన్న డైలాగ్‌తో థాయేటర్ మొత్తం చాలా హైప్‌ని క్రియేట్ చేసింది. చందన కూడా సినిమా మొత్తంలో ఒకే ఒక్క లేడీ అయినా తన పాత్ర వరకు చాలా బాగా నటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా కుదిరాయి. శ్రీనివాస్ బొగడపాటి కథను ఎంత అద్భుతంగా రాశారో తీయడం కూడా అంతే జాగ్రత్తగా చాలా బాగా తీశారు. కెమెరా ఫొటోగ్రఫీ చాలా బావున్నాయి.