యాత్ర‌కు ఎన్‌-క‌న్వెన్ష‌న్ సిద్ధం

వైఎస్సార్ జీవితంలోని కీల‌క ఘ‌ట్ట‌మైన పాద‌యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న యాత్ర ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్‌కి రెడీ అవుతోంది. మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి ఆనందో బ్ర‌హ్మ ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శివ మేక స‌మ‌ర్ప‌ణ‌లో విజ‌య్ చిల్లా, శ‌శి మేక సమ‌ర్ప‌ణ‌లో విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి ఈ చిత్రాన్నీ  నిర్మించారు. ఇదివ‌ర‌కూ బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో యాత్ర ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఊక వేస్తే రాల‌నంత మంది అభిమానులు ఈ వేడుక‌కు విచ్చేశారు. ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్
(హైద‌రాబాద్‌)లో ఫిబ్ర‌వ‌రి1న యాత్ర ప్రీరిలీజ్ వేడుక‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో జ‌గ‌న్ అభిమానులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీగా పాల్గొంటార‌ట‌. యాత్ర చిత్రం గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో రిలీజ్ కావాల్సి ఉన్నా ర‌క‌ర‌కాల కాణాల‌తో వాయిదా ప‌డింది.
జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని భావించినా థియేట‌ర్ల స‌మ‌స్య‌తో రిలీజ్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రిలో అన్ని అంశాల్ని దాటుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో వైఎస్పార్ అభిమానుల్లో. వైఎస్ కుటుంబ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. బ‌యోపిక్‌ల ట్రెండ్‌లో ఇటీవ‌ల రిలీజైన ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు ఫెయిల్యూర్ నేప‌థ్యంలో యాత్ర ఎలాంటి రిజ‌ల్ట్ అందుకోనుందో అంటూ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారంతా. సావిత్రి బ‌యోపిక్ మ‌హానటి రిజ‌ల్ట్‌ని ప్ర‌తిబింబించండం లో యాత్ర స‌ఫ‌ల‌మ‌వుతుందా? అన్న ఆస‌క్తి క‌ర‌చ‌ర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published.