రవితేజ, గోపీచంద్ కాంబినేషన్ లో ‘క్రాక్’ సినిమా షూటింగ్మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హేట్రిక్ విజ‌యాన్ని అందుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ప్రస్తుతం వీరి కాంబినేష‌న్‌లో వస్తున్న ‘క్రాక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ‘క్రాక్’ సినిమా కు సంబంధించిన వివ‌రాలు నిర్మాత‌లు వెల్ల‌డించారు. మే 8న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో రవితేజ ఖాకీ డ్రస్సులో వెహికిల్ నుంచి బయటకు వస్తూ, బదాస్ గా కనిపిస్తున్నారు.

శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన‌ట్టు స‌మాచారం. తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్ కుమార్ రెండు శక్తిమంతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘మెర్సాల్’, ‘బిజిల్’ వంటి సూపర్ హిట్ తమిళ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు ‘క్రాక్’ కు డీఓపీగా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.