అమెరికా-భారత్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళతాం

ఉగ్రవాద నిరోధక చర్యల్లో అమెరికాతో కలసి ముందుకు సాగాలని నిర్ణయించామని ప్రధాని మోడీ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం మీడియాలో ప్రధాని మాట్లాడుతూ…. అమెరికా-భారత్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని వెల్లడించారు.
ప్రపంచంలో ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం ఇరుదేశాలు కృషి చేస్తాయని, ఉగ్రవాద ప్రోత్సహించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేసారాయన. అలాగే ప్రపంచంలో విస్తరిస్తున్న డ్రగ్స్పైనా నిరంతరం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దౌత్య సంబంధాల్లో రక్షణ రంగంలో ఇరుదేశాలు సహకరించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కుదిరాయి.