అనుష్క వివాహం టీమిండియా క్రికెటర్‌తో…..

ప్రస్తుతం టాలీవుడ్‌లోని నటీమణులలో పేరొందిన పాత్రలు చేస్తున్న అనుష్క పెళ్లి వార్త ఎప్పుడూ షికార్లు చేస్తునే ఉంటుంది. బాహుబలి చిత్రం తదుపరి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రేమాయణం గురించి ఎప్పుడూ వినని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లికి దారితీస్తోందంటూ తెగ వైరల్ అయిన పోస్టులు అన్నీ ఇన్నీ కావు. అయితే ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమేనని కొట్టిపారేసింది అనుష్క .
ఆపై విదేశాలలో ఉన్న ఓ భారతీయ బిజినెస్ మ్యాన్ తో ఈ స్వీటీ పెళ్లి జరగబోతుందని వార్తలు తెగ వినిపించాయి. అదికూడా గాసిప్‌గానే మిగిలిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్‌ను వివాహం చేసుకోనుందని వార్తలు సామాజిక మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్ ఒకటి ఆరంభమైంది. మరి ఏమేరకు ఇది వాస్తవ రూపం దాల్చనుందో చూడాలి.