బాల‌య్య కొడుకా… ఇలా అయ్యాడేంటి…?


టాలీవుడ్ టాప్ స్టార్‌ల కొడుకులు ఇండ‌స్ట్రీలో తెగ సంద‌డి చేసేస్తున్నారు.  మెగా ఫ్యామీలీ నుంచి.. ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోలు ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళ టాలెంట్‌ను చూపిస్తుస్తున్నారు. కానీ నందమూరి బాలయ్య వారసుడు ఎప్పుడు వస్తాడో అర్దం కావడం లేదు. దీంతో ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్‌ ఒకటి సోషల్ మీడియాలో బయటకు వ‌చ్చి హల్ చల్ చేస్తోంది. ఈ లుక్ లో మోక్షజ్ఞ ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

నందమూరి ఫ్యామిలీ మూడో తరం నుంచి ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా ఉన్నారు. బాలయ్య మాత్రం తన తనయుడుని పరిచయం చేసే పనిలో ఉన్నాడు. బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణితో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపించింది. కానీ ఆ తర్వాత అది ఏం లేదని బాలయ్య స్పష్టం చేశారు.

ఆ తర్వాత మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తగిన శిక్షణలు తీసుకుంటున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అందులో కూడా నిజం లేదని తెలింది. అంతేకాకుండా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి బోయపాటి, త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. ఇవన్నీ కేవలం పుకార్లే మాత్ర‌మే అని తెలింది. అయితే పలు సందర్భాల్లో మోక్షజ్ఞ ఫోటోలు మీడియాలో కనిపించాయి. ఈ నందమూరి చిన్నోడి ఫిజిక్‌ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక మోక్షజ్ఞకు సినిమాల్లో నటించే ఆసక్తి కూడా లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమాలకు సిద్ధం కావడం లేదని.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా బయటకు వచ్చిన మోక్షజ్ఞ లుక్‌ చూస్తే ఆయన తెరంగేట్రం ఇక లేనట్టే అనిపిస్తోంది. ఆ లుక్‌లో ఇప్పట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు. అంటే నందమూరి వారసుడిగా తెరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిరశే. అంతేకాక ఆయ‌న బిజినెస్‌లో బిజీగా ఉన్న‌ట్లు కూడా స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌య్యకి ఉన్న క్రేజే వేరు అదే విధంగా త‌న వార‌సుడు కూడా ఎంట్రీ ఇస్తాడ‌ని ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది జీర్ణించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే.


Leave a Reply

Your email address will not be published.