హైదరాబాదీ ప్లేగాళ్ వాట్టూడూ?

మోనా చోప్రా అలియాస్ షెర్లిన్ చోప్రా  హైదరాబాద్ మూలాలు ఉన్న టాప్ మోడల్, నటి. 1999 మిస్ ఆంధ్రాగా ఎంపికై, ఆరంభం మోడలింగ్, అటుపై సినీఆరంగేట్రం చేసింది. షెర్లిన్ కి తొలిగా గుర్తింపు తెచ్చిన సినిమా ఏ ఫిలిం బై అరవింద్. రోడ్ ట్రిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షెర్లిన్ అందచందాలు కుర్రకారుకు కిక్కెక్కించే ట్రీట్ ఇచ్చాయి. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఆ చిత్రం బంపర్ హిట్ కొట్టడంతోనే షెర్లిన్ పాపులారిటీ పెరిగింది. అంతకుముందే ఈ అమ్మడు 2002లో వెండితెర అనే చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. కానీ ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. ఆ క్రమంలోనే బాలీవుడ్ కి వెళ్లింది. అక్డక 2005లో ‘టైమ్ పాస్’ అనే చిత్రంలో నటించింది.
తర్వాత దోస్తీ- ఫ్రెండ్స్ ఫర్ ఎవర్వర్, జవానీ దివానీ- ఏ యూత్ ఫుల్ జోయ్ రైడ్, నాటీ బోయ్, గేమ్, రఖీబ్, రెడ్ స్వాస్తిక్, దిల్ బోలే హడిప్పా వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ ఈ అమ్మడు యూనివర్శిటీ అనే చిత్రంలో నటించింది. హాలీవుడ్ లో బీపర్ అనే చిత్రంలో నటించింది. అయితే కెరీర్ పీక్స్ కి వెళుతుంది అనుకుంటే నత్తనడకనే సాగింది. ఆ క్రమంలోనే ప్రఖ్యాత ప్లేబోయ్ కవర్ పేజీపై నగ్నంగా దర్శనమిచ్చి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొన్ని వేడెక్కించే సినిమాల్లోనూ నటించింది. కామసూత్ర చిత్రంలో ఈ అమ్మడి అందచందాలకు యూత్ ఫిదా అయిపోయారు. మొత్తానికి షెర్లిన్ కెరీర్ ఇప్పటికీ టేకాఫ్ కాకపోవడం ఓ పెద్ద మైనస్.

Leave a Reply

Your email address will not be published.