గోడ మీద వార్తలు

01 . నెల్లూరు మాఫియాలకి అడ్డాగా మారింది – ఇక్కడ లేని మాఫియా లేదు – ఆనం రాం నారాయణ రెడ్డి …

అబ్బో అబ్బో అబబో ….అంటే – ఈ ఆరు నెలల్లో బాంబేని పెడేల్మని తలదన్నే స్దాయిలో అభివృద్ధి చెందిపోయిందంటారంతేగా ….??

02. అన్ని స్కూల్లలో నర్సరీ , LKG – UKG లు బ్యాన్ – ఐదేళ్ళొచ్చే వరకూ పిల్లలని స్కూలుకి పంపటానికి వీళ్ళేదన్న – హర్యాణా ప్రభుత్వం …

మంచిపని చేసార్రా సామీ – లేపోతే మూడో నెల పిండ దశ నుండే ఐఐటీ కోచింగులంటూ సావ గొడుతన్నారు పిలకాయల్ని – పాపం …!!

03. హోటలు గదిలో పెళ్ళి కాని ఆడ మగ కలిసుండటం నేరంగా పరిగణించలేం – చట్టంలో ఎక్కడా అలా వ్రాసి లేదు – మద్రాసు హైకోర్టు  ..

మరేం – పనికొచ్చేవి – పది మందికీ ఉపయోగ పడేవీ ఎప్పుడు వ్రాసి సచ్చారని ఆ చట్టాల్లో..?? ఇహ చూడండి పడిపోయిన లాడ్జీలేపారం లేచి కూర్చుంటాది…!!

04. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణీకులకి శుభవార్త – పల్లెవెలుగు, సిటీ బస్సులకి కిలోమీటరుకి 10 పైసలు – మిగిలినాటికి 20 పైసలు పెంచిన ప్రభుత్వం …

ఈ క్రిస్టమస్సుకీ – జనవరొకటీ – సంకురాత్రులకి ఇంతకన్నా పెద్ద శుభవార్తతలేం కావాల్రా సామీ – డూ ఫెస్టివల్ డూడ్  …!!

05. ఖజానా ఖాళీ అయిపోవటంతో ఇప్పటి వరకూ చేసిన 29 వేల కోట్ల అప్పు కాకుండా మరో 15 వేల కోట్ల అప్పు చేసేందుకు అను మతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన – ఆంధ్ర సర్కార్ …

సొమ్ములన్నీ సున్నాలకీ – కిటికీ ఊసలకే సరిపాయే – ఇహ … కొత్తప్పొస్తే  పైకప్పు  మారుస్తారేమో…!!

Leave a Reply

Your email address will not be published.