అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా?.. రద్దు చేయాలా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి జనవరి 27న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ భేటీ జరగనున్నట్టు వైసిపి వర్గాలు చెపుతున్నాయి. ప్రధానంగా రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా?.. రద్దు చేయాలా? రద్దు చేయాల్సి వస్తే, న్యాయపరంగా చిక్కులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు ఇందుకు సహకరిస్తుంది. అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని గురువాంర సీఎం వైఎస్ జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరిన పిమ్మట సోమవారం కూడా అసెంబ్లీ సమావేశం కానుంది. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు అనుమతించడంతో ఈ అంశంపై చర్చించేందుకు విపక్ష తెలుగుదేశం పార్టీ అభిప్రాయం తీసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాగా సోమవారం సమావేశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ బహిష్కరించి, ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తూ పోతున్న వ్యవస్ధలపై ప్రజాక్షేత్రంలో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలియవచ్చింది.