అజయ్ భూపతి దర్శకత్వం లో హీరో శర్వానంద్……

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు అజయ్ భూపతి, విభిన్న కథల చిత్రాల హీరో శర్వానంద్ ల కాంబినేషన్లో కొత్త చిత్రం మహా సముద్రం త్వరలో పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం జాను చిత్రంలో బిజీగా ఉన్న శర్వానంద్ దీని తదుపరి ఈ చిత్రంలో నటించే ఆస్కారం కనిపిస్తోంది., కాగా ఈ సినిమాలోనూ సమంత కథానాయికగా నటించ నున్నట్టు తెలియవచ్చింది.
నిజానికి ఈ మహాసముద్రం కథని . నాగచైతన్య – సమంత జంట ని ఊహించుకుని అజయ్ భూపతి రాసుకున్నాడు. ఈ సినిమా కథని అటు చైతు, ఇటు సమంత వేర్వేరుగా విన్నారు కూడా. అయితే ఇప్పటికే పలు సినిమాలకు వరుస కాల్షిట్లు ఇచ్చేయటంతో చైతు ఈ చిత్రం వాయిదా వేయాలని అనుకోవటంతో మరి రెండేళ్లు వరకు సినిమా పట్టాలెక్కే పరిస్థితి కనిపించలేదు. దీంతో సమంతని కలసిన భూపతి, సినిమా విషయంపై మరోమారు చర్చించగా చైతు సూచనలతోనే శర్వానంద్ ని కలసి కథ వినిపించడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని ఫిలింనగర్ టాక్. ఇందులో సమంతతో పాటు మరో కథానాయికగా ఎవరు కానుందన్న ప్రశ్న అందరిలో వినిపిస్తోంది.