ఓ కామెడీ థ్రిల్లర్ లోఛాన్స్ దక్కించుకున్న శివాత్మిక

దొరసాని చిత్రంతో వెండితెరకు పరిచయమైన రాజశేఖర్, జీవిత ల చిన్న కూతురు శివాత్మిక దొరగారి కూతురు దేవకిగా చక్కగా నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకుని, ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చినా ఎందుకో సినిమాలు రాలేదని ఇబ్బంది పడుతున్న తరుణంలో ఓ కామెడీ థ్రిల్లర్ లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
యంగ్ హీరో అరుణ్ అదిత్ కధానాయకుడిగా దర్శకుడు దుర్గా నరేష్ గుట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాత్మిక హీరోయిన్ గా ఎంపికైంది. ఎస్ కె ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో శివ దినేష్ రాహుల్, అయ్యర్ నకరకాంతి నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా జరగనుందని చిత్ర యూనిట్ తెలిపింది.
టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఆరంభం కానున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఓ కీలక రోల్‌తో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుండగా కోట శ్రీనివాసరావు, పోసాని, సత్య, అజయ్ ఘోష్, అజయ్, జయప్రకాష్ రెడ్డి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. కున్న