డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం తారకరామపురం కాలనీకి చెందిన లోకేష్,దేవిల కుమారుడు ఇంద్రనీల్ (5) నాలుగు రోజులు గా అనంతపురం సాయి నగర్ లోని శిశు కేర్ ఆసుపత్రికి తీవ్ర జ్వరంగావుందంటూ తీసుకెళ్లారు.వైద్యులు డెంగ్యూ సోకిందని చికిత్స చేశారు.పరిస్థితి విషమంగా ఉంటే చెబితే మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళతామని తల్లి తండ్రులు చెప్పగా వైద్యులు మాత్రం డబ్బులకు ఆశపడి మెరుగైన వైద్యం అందిస్తాం అనిచెప్పి మమ్ములను వెళ్ళనివ్వకుండా చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారని చివరకు వీరి నిర్లక్షం కారణంగా మా బాబును చనిపోయాడని వాపోతున్నారు.మాబాబు మృతికి డాక్టర్ల ధన దాహం వారి నిర్లక్షమే కారణమని వారు ఆరోపిస్తున్నారు .