కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే..


ఏ కార్యాలయాన్ని ఫిభ్రవరి 23వ తేదీ వరకు తరలించవద్దని, తరలించే ఆదేశాలు కూడా జారీ చేయవద్దని.. ఒకవేళ కార్యాలయం అధికారులు తరలిస్తే.. అందుకు అయ్యే ఖర్చును వారి జీతభత్యాల నుండి వసూలు చేస్తామని కోర్టు హెచ్చరించినా, ప్ర‌భుత్వం మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరావతి రాజధానిని విశాఖ నగరానికి తరలించటం ఖాయం చేసిన‌ట్టు కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఎంపీ విజయసాయిరెడ్డి  శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మునిసిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్‌, శాస‌న‌స‌భ్యులు ధర్మాన ప్రసాదరావు,  గుడివాడ అమరనాద్‌లు  వీరందరూ బాహాటంగానే రాజ‌ధాని త‌ర‌లింపు ఖాయ‌మంటూ మీడియాల‌లో తెగ మాట్లాడేస్తున్నారు.  అమాత్యులై ఉండి ఇలా  కోర్టు ఆదేశాలను దిక్కరిస్తుంటం జ‌నాల‌కి ఎలాంటి సందేశం ఇస్తున్నారో చెప్పాలి.

ఉత్త‌రాంధ్ర‌వెనుక బాటుకు అందునా శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల వెనుక బాటుకు కేవ‌లం రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం పార్టీదే త‌ప్పంతా అని నెపాన్ని నెట్టేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి 70 వ‌సంతాల స్వ‌తంత్ర్య భార‌తావ‌నిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డ్డాక దాదాపు 25 ఏళ్ల పాటు ధ‌ర్మాన‌, త‌మ్మినేని, బొత్స‌లు మంత్రులుగా ఒర‌గ‌బెట్టారన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కావ‌టం స‌హ‌జం. దీనికి త‌గిన స‌మాధానం ఇచ్చుకునే ప‌రిస్థితి ఎవ్వ‌రూ లేర‌న‌టానికి ఎప్పుడో మూత బ‌డ్డ ఆమ‌దాలవ‌ల‌స చ‌క్కెర క‌ర్మాగారం తిరిగి ఆరంభిస్తామంటూ ఈ నేత‌లు కొన్ని వంద‌ల సార్లు ప్ర‌తిన‌లు బూన‌టం, గెలిచి అధికారంలోకి వ‌చ్చాక గ‌ట్టున బెట్ట‌డం రివాజుగా మారిపోయింద‌న్న వాస్త‌వం వారు కూడా జీర్ణించుకోలేనంత చేదు నిజం. 

అయితే తాజాగా రాజ‌ధానిలోని కార్యాల‌యాల‌ త‌ర‌లింపు విష‌యంలో మొండితనంతో ఆదేశాలు జారీ చేయ‌టంమొండివాడు రాజుక‌న్నా బ‌ల‌వంతుడ‌న్న చందంగా పాలకులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నిపించ‌క మాన‌దు. విజిలెన్స్‌ కమీషనర్‌ కార్యాలయంతో పాటు కమీషనర్‌ ఎంక్వైరి అధికారుల కార్యాలయాలు కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలని లిఖిత పూర్వక ఆదేశాలు జారీ అయ్యాయి.  కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానికే దక్కిందని చెప్పవచ్చన్న వాద‌న‌లూ వెల్లువెత్తుతున్నాయి.  

సోమవారం నాడు ఉత్తర్వుల కాపీలతో  పలువురు అడ్వకేట్‌లతో పాటు గతంలో కోర్టును ఆశ్రయించిన వారు  ప్రభుత్వ ప్రదాన కార్యదర్శినీలం సహాని పై కోర్టు దిక్కరణ కేసును వేసే అవ‌కాశాలున్న‌ట్టు క‌నిపిస్తోంది.  పాలకులు ఏ నిర్ణయాలు తీసుకున్నా   ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. పలానా తేదీ వరకు ఈఆదేశాలు వర్తిస్తాయని స్ప‌ష్టంగా చెప్పినా  రెండు కార్యాలయాల తరలింపుకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పేర జారీ కావటంతో ఆమెపై వ‌త్తిళ్లేమైనా ఉన్నాయా? అన్న ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది.   విజిలెన్స్‌ కమీషన్‌, కమీషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కార్యాలయాలకు ఎలాంటి సంబందం ఉండదు. ఎప్పటి నుండో ఆ రెండు కార్యాలయాలు సచివాయంలోనే పని చేస్తూనే ఉన్నాయి

కానీ వీటి త‌ర‌లింపు ఉత్త‌ర్వులో ముఖ్యమంత్రి ఆదేశాలు అనే పదం కానీ, ఏ కారణాలతో కార్యాలయాలను తరలిస్తున్నామో కానీ పేర్కొన‌లేదు. ఇలా ఉత్త‌ర్వులు ఇవ్వ‌టం ద్వారా మిగతా కార్యాలయాల తరలింపు కూడా ముందు ముందు కొనసాగుతాయన్న సంకేతాలను జ‌నంలోకి పంప‌డ‌మేన‌న్న వాస్త‌వం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. 

ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి వ‌చ్చిన సూచ‌న‌ల మేర‌కు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు అధికారిక వ‌ర్గాలు చెపుతూ వ‌స్తున్నా… చివరకు ఆమె బలి పశువు కాబోతున్నారేమో అని ఆందోళన చెందుతున్నారు అధికారులు, ఉద్యోగులు.  ఒక‌వేళ కోర్టు దిక్కరణ కేసు దాఖ‌లైతే  ముందుగాకోర్టుకు పిలిపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. 
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా కొనసాగే కంటే దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లి ప్రశాంతంగా రిటైర్డు అవ్వాలని నీలం సహాని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం రాష్ట్రానికి సిఎస్ ప‌ద‌వి అని అనుకోవ‌ట‌మేన‌ని, గ‌తంలో ఇక్క‌డ ఆమె ప‌నిచేసినా మారిన రాజ‌కీయ ప‌రిణామాల క్ర‌మంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌చ్చారు. అయితే  ఆంథ్ర రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అవగాహన లేకుండా.. తెలుసుకోకుండా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్చినందుకు నీలం సహానికి  ఎన్న‌డూ ఎదురు కానీ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయ‌న్న‌ది రెవెన్యూ వ‌ర్గాల గుస‌గుస‌. ప‌లు నిర్ణ‌యాల‌లో భాగ‌స్వామ్యం చేయ‌టం లేదు స‌రిక‌దా…. కేవ‌లం ఓ మంచి అధికారిణిని తీసుకొచ్చి ర‌బ్బ‌రు స్టాంప్‌లా మార్చేసార‌న్న ఆవేద‌న  ఆ వ‌ర్గాల‌లో ఉంది. ఈ క్ర‌మంలోనే నిత్యం టెన్షన్‌తో పని చేయాల్సిన పరిస్థితులుండ‌టంతో స‌హానీ కూడా విసిగి వేసారిపోయార‌ని  కోర్టు, జగన్‌ మధ్య నీలం సహాని నలిగిపోతున్నారని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల‌ని స‌హానీ నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. 

త‌ను రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను స‌హ‌చ‌రుల‌తో పంచుకుంటూ కేంద్రం నుండి రాష్ట్ర సర్వీసులకు ఎందుకు వచ్చానా అని నీలం సహాని బాధ పడుతున్నారని, విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇలాంటి ప‌రిస్థితిలో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి గా నీలం సహాని వ్యక్తి గత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళితే.. ఆ పదవిలొ పదవిలో చేరేందుకు కానీ  అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు  కూడా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు నిరాక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం.  స‌హానీ ఎదుర్కొంటున్న పరిస్థితి మాకొద్దు అంటూ అనేక మంది సీనియర్‌ ఐఎఎస్‌లు దూరంగా జ‌రుగుతున్నార‌ని తెలుస్తోంది. 

కాగా నీలం స‌హానీ ద‌గ్గ‌ర గ‌తంలో ప‌నిచేసిన అధికారులు కొంద‌రు మీడియాతో ఈ విష‌యాల‌ని పంచుకుంటూ  ఆమెను ఏపికి రావద్దని మేము ముందుగానే చెప్పామ‌ని, కానీ ఎవరెవరిని గుడ్డిగా నమ్మి ఇక్కడికి వచ్చారో, త‌మ మాట‌కు విలువ ఇవ్వ‌లేదు. ఇప్పుడు   ఫలితం అనుభవిస్తున్నారని, ఆమె మాట ప్ర‌భుత్వంలో చెల్లుబాటు కాకుండా పోయింద‌ని స‌హానీకి సానుభూతి తెలుపుతుండ‌టం విశేషం. 

ఈ నేప‌థ్యంలో  కోర్టు ఏ నిర్ణయం తీసుకున్న త‌దుప‌రే ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పదవిలో కొనసాగాలా.. లేదా సెలవుపై వెళ్లాలా అనే విషయంపై  నీలం సహానీ ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్టు క‌నిపిస్తోంది.  మ‌రేం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.