ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం పలు శాఖలకు సంబందించిన అధికారులను బదలీ చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్ సిన్హాను నియమించారు. ఈయన 2000 బ్యాచ్ కి చెందిన మనీశ్ కుమార్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కుమార్ విశ్వజిత్ నిఘా విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించాల్సి నేపథ్యంలో ఆయనను నిఘా విభాగం నుండి రిలీవ్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో హోమ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ హసన్ రజాను జైళ్ల శాఖ డీజీగా బదలీ చేసింది. నెల్లూరు ఎస్పీగా విధుల్లో ఉన్న ఐశ్వర్య రస్తోగిని, డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ విభాగం ఏఐజీగా నియమిస్తూ, భాస్కర్ భూషణ్ ను నెల్లూరు ఎస్పీగా నియమించింది. ప్రస్తుతం ఏ విధమైన విధుల్లోనూ లేని టీఏ త్రిపాఠిని, సాధారణ పరిపాలనా శాఖకు పంపింది.