నాని ఇన్ని గెటప్లా…?

స్పోర్ట్స్ డ్రామాలో ‘జెర్సీ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం న్యాచరల్ స్టార్ నాని నటిస్తన్న సంగతి తెలిసిందే గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తవగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.
ఈ సినిమాలో నాని పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేవిధంగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని పాత్ర నాలుగు షేడ్స్ లో ఉంటుందని సమాచారం. ఒక వ్యక్తి జీవితంలో ని నాలుగు ముఖ్య దశలను ప్రతిబింబించే పాత్రలో 19 ఏళ్ళ టీనేజర్ గా.. 25 సంవత్సరాల యువకుడిగా.. 40లలో ఉండే మధ్య వయస్కుడిగా.. 50 ఏళ్ళ పై బడిన వ్యక్తిగా నాలుగు గెటప్స్ ఉంటాయట. ఈ సినిమా హాలీవుడ్ చిత్రం ‘ది క్యూరియాస్ కేస్ అఫ్ బెంజమిన్ బటన్’ స్టైల్ లో సాగుతుందని అంటున్నారు. ఇలా నాలుగు పూర్తిగా డిఫరెంట్ గా ఉండే గెటప్స్ లో ఉండడం.. దానికి తగ్గట్టు నటించడం ఛాలెంజ్ తో కూడుకున్న అంశమే. నిజానికి ఈ ఛాలెంజింగ్ పార్ట్ నచ్చడంతోనే విక్రమ్ కుమార్ కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చాలా రోజల తర్వాత ఒక దర్శకుడు నాని యాక్టింగ్ టాలెంట్ ను ఫుల్ గా బయటకు తీసే పాత్రను డిజైన్ చేశాడన్నమాట.