సిరివెన్నెలకు పద్మశ్రీ

తెలుగు సినిమా పాటకు వన్నె తెచ్చిన మేటి సాహితీకారుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు ప్రధమ వరుసలో ఉంటుంది. వందలాది పాటలు రాసి తెలుగు వారి అభిమానం చూరగొన్న గొప్ప సినీ సాహితీకారుడు సిరివెన్నెల. దశాబ్ధాల పాటు పాటకు, సినీరంగానికి గొప్ప సేవలందించారాయన. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. సినిమా విభాగంలో.. మలయాళ హీరో మోహన్ లాల్ కు పద్మభూషణ్ని ప్రకటించారు. సిరివెన్నెల, మనోజ్ భాజ్ పాయ్, ఆల్ రౌండర్ ప్రభుదేవా, శంకర మహదేవన్, శివమనిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. 112 పద్మ లు ప్రకటిస్తే అందులో తెలుగు రాష్ట్రాలకు నాలుగు పురస్కారాలు దక్కాయి. సిరివెన్నెల సీతారామా శాస్త్రి పురస్కారం అందుకోగానే.. ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు తనకు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అనకాపల్లి (విశాఖ జిల్లా) వాస్తవ్యులైన సిరివెన్నెల కాకినాడ పీఆర్ కాలేజ్ లో స్టడీ కొనసాగించి, అటుపై టాలీవుడ్ లో లిరిసిస్టుగా స్థిరపడ్డారు. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలకు సాహిత్య ం అందించారు. కెరీర్లో 11 నందులు అందుకున్న ఆయన నంబర్ 1 పారితోషికం అందుకునే లిరిసిస్టుగానూ రికార్డులకెక్కారు. ఆయన అసాధారణ ప్రతిభకు పద్మశ్రీ ఎప్పుడో రావాల్సినది.. ఆలస్యమైందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.