కరోనా నుంచి బైట‌ప‌డ్డ‌ శతాధిక వృద్ధుడుప్ర‌పంచాన్ని క‌రోనా వ‌ణికిస్తుంటే … దీనికి మూలంగా చైనాలో కరోనా వైరస్ బారిన పడిన ఓ వందేళ్ల వృద్ధుడు దాని నుంచి పూర్తిస్థాయిలో బయటపడడం ఇప్పుడు అక్క‌డ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 
 వూహాన్‌కు చెందిన వందేళ్ల వృద్ధుడు కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతూ  హుబెయిలోని మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో  గత నెల 24న చేరాడు.ఇత‌నిని ప‌రిశీలించిన వైద్యులు  ఫ్లూ లక్షణాలతో పాటు అల్జీమర్స్, బీపీ,  గుండె వ్యాధుల‌తో బాధపడుతున్నట్టు గుర్తించి  13 రోజుల పాటు చికిత్స చేసారు. తాజాగా అతడిని పరీక్షించిన వైద్యులు అనూహ్యంగా అత‌నిలో కరోనా లక్షణాలు క‌నిపించ‌క పోవ‌టంతో అశ్చ‌ర్య‌పోయి మ‌రిన్ని ప‌ర్యాయాలు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. చివ‌ర‌కి క‌రోనా లేద‌ని  నిర్ధార‌ణ‌కు వ‌చ్చి అతడితోపాటు కోలుకున్న మరో 80 మందిని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కరోనా వైరస్ నుంచి బయటపడిన అతి పెద్ద వయస్కుడిగా ఆ వృద్ధుడు రికార్డు సృష్టించాడు.

వూహాన్‌లో తొలిసారి వెలుగుచూసిన ఈ వైరస్  చైనాలో ఇప్పటి వరకు దాదాపు మూడు వేలమందికి పైగా పొట్టనపెట్టుకోగా  దాదాపు ల‌క్ష‌మంది  కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అలాగే, 70 దేశాలకు విస్తరించిన ఈ వైర‌స్‌కు లోనైన  40 కరోనా నిర్ధారిత కేసులు నమోదైన విష‌యం విదిత‌మే.

 

Leave a Reply

Your email address will not be published.