ఫిబ్రవరి 7న ప్రేక్ష‌కుల ముందుకు స‌వారీ

 కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించిన సవారీ సినిమా విడుదలకు సిద్ధమైంది. యానిమల్ లవ్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో  నందు, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు క్రేజ్ వచ్చిందని, పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని నిర్మాత‌లు ఆనందం వ్య‌క్తం చేసారు. 

అన్ని వర్గాలను ఆకట్టుకునే  తీనేగా  తెరకెక్కిన సవారి చిత్రంలో  రాహుల్ సిప్లిగంజ్ పాడిన నీ కన్నులు లిరికల్ సాంగ్ 5 మిలియన్ వ్యూస్ దక్కించుకుని.. ఇంకా వ్యూస్ తెస్తూనే ఉందని చెప్పారు. అలాగే ఉండి పోయా పాటకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంద‌న్నారు. 2020, ఫిబ్రవరి 7న విడుదల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

సాహిత్ మోత్కూరి  ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన‌ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా నైజాంలో సవారి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు  ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ – ప్రొడక్షన్ సంస్థ ఏషియన్ సినిమాస్   థియేట్రికల్ హక్కులను దక్కించుకోవ‌టం విశేషం.


Leave a Reply

Your email address will not be published.