రెండిటికీ చెడ్డ రేవ‌డి పృథ్వీ.నోటి దురుసు ఒక్కోసారి మ‌నం చేసే ప‌నికే ఎస‌రు పెడుతుంద‌న్న‌ది వాస్త‌వం. అందునా సినిమాల‌కు..రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధాలుండే చోట మ‌రీనూ…  రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, సినిమా వాళ్ల‌ని సూటిపోటి మాట‌లంటే వాళ్లూరుకుంటారా? అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు నొక్కిప‌డేస్తారు. రాజ‌కీయంగా త‌ల‌కిందులైతే మ‌ళ్లీ సినిమాల‌లోకి రావాల‌న్నా ఆస‌రాకూడా ల‌భించ‌దు. రెండిటికీ చెడ్డ రేవ‌డి కావ‌టం ఖాయం. ఇదే ప‌రిస్థితి తాజాగా థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వీ ఎదుర్కొంటున్నాడు. 

  కెరీర్ సినిమాల్లో థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ ది ఓ ద‌శ‌లో పీక్స్‌కు చేరుకుని. బ్ర‌హ్మానందం త‌ర్వాత  స్థానం అందుకుంటాడ‌ని భావిస్తున్న క్ర‌మంలో ఆయ‌న రాజ‌కీయాలలో అడుగుపెట్టాడు. వైసిపి త‌ర‌పున జ‌గ‌న్‌తో క‌ల‌సి పాద‌యాత్ర చేయ‌ట‌మే కాకుండా ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చాక ఎస్వీబిసి చైర్మ‌న్ ప‌ద‌వి అందుకున్నారు. 

అయితే … అవ‌కాశం దొరికి న‌ప్పుడ‌ల్లా   పృథ్వీ ఎలాంటి ఆలోచించుకోకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై, జ‌న‌సేనానిపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌టం ఆరంభించాడు. విమ‌ర్శ‌లు చేసే ముందు కూడా ఆలోచించుకుని మాట్లాడాలని ఎవ‌రేం చెప్పినా నెవ్వ‌ర్‌. త‌నేం అనుకుంటే అదే చెపుతానంటూ హూంక‌రించేవాడు. ఒక‌ప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ప్ర‌త్యేకంగా పృధ్వీకి పిలిచి మ‌రీ పాత్ర‌లిచ్చేవారు తీరా ప్ర‌స్తుత ప‌రిస్థితిలో గ‌తంలో ఆయ‌న చేసిన విమ‌ర్శ‌లు కార‌ణంగా  సినిమా కెరీర్‌పై  ఎఫెక్ట్ ప‌డి మెగా హీరోలే కాదు వారితో సంబంధాలు నెరిపే నిర్మాత‌లు పృధ్వీని త‌మ‌సినిమాల‌లో తీసుకునేందుకు స‌సేమిరా అంటున్నార‌ట‌. 

అలాగే నంద‌మూరి ఫ్యామిలీ సైతం పృధ్వీని ప‌క్క‌కు పెట్టాల‌ని నిర్ణ‌యించింద‌ని వార్త‌లొస్తున్నాయి.  ఈ మ‌ధ్య   త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌`అల వైకుంఠ‌పుర‌ములో`  జ‌య‌రాం బామ‌ర్ది పాత్ర‌కు ముందుగా పృథ్వీనే తీసుకున్నారు.  తీరా ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌లు రావ‌టం  పృథ్వీ త‌న మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై రెచ్చిపోయి చేసిన వ్యాఖ్య‌లతో  పృథ్వీని సినిమా నుంచి తీసేసి  ఆ ప్లేస్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను తీసుకున్న విష‌యం విదిత‌మే.   

 ఎస్‌వీబీసీ ఛైర్మ‌న్‌గా ఉన్న పృధ్వీ ఓ మ‌హిళ తో  మాట్లాడిన అస‌భ్య‌క‌ర మాట‌లు బ‌య‌ట‌కు పొక్క‌డంతో వివాదం రేగి ఆత‌ని రాజ‌కీయ ప‌రిస్థితి  తారుమారు అయ్యింది. ఇప్ప‌డు పార్టీ ప‌రంగా చేసిన సేవ‌ల‌కు అందుకున్న పోస్టు నుంచి ప్ర‌భుత్వం పీకేస్తే, సినిమాల‌లోనూ అవ‌కాశాలు రాని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి ఈ ప‌రిస్థితి ఎన్నాళ్లు ఎదుర్కొంటాడో పృధ్వీ చూడాలి. 

 

Leave a Reply

Your email address will not be published.