తలోదగ్గర మొండెం మరోదగ్గర… జెసి సెటైర్లు

తలని నరికి మెండెం మరోదగ్గర పెడతామన్నట్టు ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన ఉందంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసారు అనంతపురం టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. గురువారం ఆయన మీడి యాల మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా వాడు అంటూ చురకలంటిస్తునే, కేంద్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసినందు రాజధాని అక్కడే ఉంటుంది కానీ, సీఎం ఆఫీస్ .. సెక్రటేరియట్ మాత్రం విశాఖలో పెడతామంటుండటం చూస్తుంటే పిచ్చి తుగ్లక్ కూడా ఇలా ఆలోచన చేసి ఉండడని మండిపడ్డారు.
రాష్ట్రం విభజన సమయంలో రాజధాని బెజవాడ లో పెట్టినందుకు కొంత ఇబ్బందే అయినా సర్ధుకు పోయామని, కానీ విశాఖకు తరలిస్తే ఎలా వెళ్లాలి విశాఖ వెళ్లే భార్యాబిడ్డలను వదిలేసి వారాల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని తరలించే ప్రయత్నం జగన్ చేస్తే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమానికి మద్దతుగా నిలుస్తామని ఆయన హెచ్చరించారు.
విశాఖ రాజధాని అయితే అనంతపురం, రాయలసీమ ప్రజలకు ఇబ్బందేనని జేసీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మార్చుకుంటూ పోవడం సరికాదన్నారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు పెడతామంటూనే సమాచారం అందించాల్సిన సచివాలయం లేకుండా చేయటం చూస్తుంటే, హోదా, ఆర్ధిక భారాలతో పథకాల అమలు నుంచి తప్పించుకునేందుకే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు ఉందని, ఇది మావోడికి మంచిది కాదని ఆయన జగన్‌కి హితవు పలికారు.