బాసర ట్రిపుల్‌ ఐటీకి అంతర్జాతీయ స్థాయి అవార్డు


నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాల(ఆర్జీయూకేటీ)కు అంతర్జాతీయ స్థాయిలో మరో అవార్డు దక్కింది. ఈ నెల 11న థాయ్‌లాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆసియా మోస్ట్ ట్రస్ట్‌డ్ ఎడ్యూకేషన్ అవార్డు-2019ను కళాశాల తరపున మన దేశ ప్రతినిధి మల్లెల శివరాం అందుకున్నారు. ఆసియాలో అత్యంత విశ్వసనీయ విద్యా సంస్థగా బాసర ట్రిపుల్‌ ఐటీను గుర్తించడంతోనే ఈ అవార్డు దక్కిందని వీసీ అశోక్‌కుమార్ తెలిపారు. విద్యార్థులతో పాటు అధ్యాపకుల కృషితో ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు అంతర్జాతీయ స్థాయి అవార్డులు బాసర ట్రిపుల్‌ ఐటీకి దక్కాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.