విల‌న్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న హీరో సునీల్

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు  ప్రేక్షకుల మ‌న్న‌ల‌ను అందుకున్న సునీల్    క‌ల‌ర్‌పోటో చిత్రంలో  విల‌న్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. వీరు వింటున్న‌ది నిజ‌మే….   సునిల్ పుట్టిన‌రోజు శుక్ర‌వారం జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా   క‌ల‌ర్‌ఫోటో లుక్ ని విడుద‌ల చేశారు.. దీనికి సామాజిక మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. 
 హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి   బ్లాక్ బాస్టర్స్ కొట్టిన‌ అమృత ప్రొడక్షన్స్   లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో క‌ల‌సి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కలర్ ఫోటో .  అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో  సుహాస్ హీరోగా చేస్తుండ‌గా  చాందిని చౌదరి జోడి గా నటిస్తోంది. 
  ఇటీవ‌ల మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి కుమారుడు కాల భైరవ  సంగీత సార‌ధ్యం వ‌హించిన ఈ చిత్రంలో సునీల్ విల‌న్‌గా ఎలా న‌టించాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే…  
 

Leave a Reply

Your email address will not be published.