జాతీయ జెండాని అగౌరవపరిచిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు….

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. నగర వైసీపీ ఆధ్వర్యంలో వేడుకల‌లో   పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి అంద‌రినీ అవాక్క‌య్యేలా చేసారు. 
 మ‌రోవైపు   విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ జాతీయ పతాకాన్ని అవిష్కరిస్తుండగా స్ధంభంపై ఉన్న చక్రం విరిగి జాతీయ జెండా కిందపడింది.  దీనికి   వెన్యూ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కార‌ణ‌మ‌ని ఉన్న‌తాధికారులు స‌ర్ధి చెప్పుకుని   మళ్లీ అన్ని సరిచేసి జాతీయ జెండా ఎగురవేశారు.
పతాకం వాడకం, ప్రదర్శనలకు సంబంధించిన నియమాల సమాహారం The Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 స్థానంలో వచ్చిన జాతీయపతాక నియమావళి – 2002  చెపుతోంది.  భారతీయ చట్టం ప్రకారం జెండాను ఎల్లవేళలా “గౌరవంతో, విధేయతతో” చూడాల్సిన బాధ్య‌త ఉంది. జెండాను తలకిందులు చేయడం నేరం. పతాకావిష్కరణకు వాడే జెండాకఱ్ఱలకు, జెండాను కఱ్ఱకు కట్టే తాడుకు కూడా ఇలాంటి నియమాలే వర్తిస్తాయి. ఇవన్నీ సరైన స్థిలో ఉండేట్టు జాగ్రత్త వహించాలి. ఈ నియ‌మావ‌ళి చెపుతోంది.  మ‌రి అధికారులు వీరిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.