పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవ‌ల విడుదలై సంచ‌ల‌న సృష్టించింది.
తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.  కృతి శెట్టి కథానాయికగా తెలుగు తెరకు ప‌రిచ‌య మ‌వుతున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర భిన్నంగా సాగుతుంద‌ని యూనిట్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అలాగే  ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుండ‌గా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్రాన్ని 2020 ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published.