ఇండియా తో పాటు పాకిస్థాన్‌ తో కలిసి పనిచేస్తా : ట్రంప్ తాజా వ్యాఖ్య‌

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భార‌త్‌తో పాటు పాకిస్థాన్‌తోనూ క‌ల‌సి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ . సోమ‌వారం ఆయ‌న అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ సభలో మాట్లాడుతూ… ప్ర‌పంచంలో  ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్న త‌ను సహించబోమని తేల్చిచెప్పారు. ఇప్ప‌టికే  అనేక‌మంది ఐఎస్ ఉగ్రవాదులను త‌మ‌ సైనికులు మట్టుబెట్టారని , ప్ర‌పంచంలో ఉగ్ర‌వాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తున్నారని చెప్పారు.  100 శాతం ఉగ్రవాదులను నిర్మూలించడానికే  త‌మ సేన‌లు రంగంలోకి దిగాయ‌ని,  ప్రజలను ఉగ్రవాద ముప్పు నుంచి కాపాడేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని  ట్రంప్ తెలిపారు. 

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతీ ఒక్క దేశంతో కలిసి పనిచేస్తామని ట్రంప్ పేర్కొంటూనే, పాకిస్థాన్‌తో అమెరికాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం  చేస్తున్నామ‌ని చెప్పారు. అయితే ఆక్ర‌మిత కాశ్మీర్ అంశంలో పాక్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ట్రంప్ ధోర‌ణిలో ఏమాత్రం మార్పు రాలేద‌ని, భార‌త్ ప‌ర్య‌ట‌న లో ఈ వ్య‌వ‌హారంపై ఆయ‌న స్ప‌ష్ట‌త ఇచ్చి, భార‌త్‌కు మ‌ద్ద‌తు ఇస్తారంటూ అధికార బిజెపి నేత‌లు గ‌త కొన్ని రోజులుగా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌న్నీ  ఇండియాతోపాటు పాకిస్థాన్‌తో కూడా కలిసి పనిచేస్తామని చెప్ప‌డం నీళ్లు పోసిన‌ట్ట‌య్యింది.  దీంతో ట్రంప్ తాజా వ్యాఖ్య‌ల‌పై దేశ మంతా  చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published.