రాజ్యాంగ స్పూర్తితో… మ‌త‌మౌఢ్యం వీడ‌దాం..

ఈ దేశాన్ని మతాతీత రాజ్యంగా నిర్దేశించుకుంటూ భారత రాజ్యాంగం త‌యారైంది. అంబేద్క‌ర్ నేతృత్వంలో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకునేలా రూపొందిన ఈ రాజ్యాంగం ప్ర‌ప్రంచంలోని అన్ని దేశాల‌కు ఇప్పుడు ఆద‌ర్శంగా నిలుస్తోంది. ప్ర‌జాస్వామ్య‌ప‌రిపాల‌నా విభాగాల‌నే కాదు ప్ర‌జ‌ల‌కు హ‌క్కులు క‌లిపించేలా దీని రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ నేత‌లు దీని మూలాల‌కే తూట్లు పొడిచేలా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం.  భారత రాజ్యాంగాన్ని అనుస‌రిస్తాన‌ని, తుచ తప్పకుండా అమలు చేస్తాన‌ని, ఆ రాజ్యంగంపై త‌మ ఇష్ట‌దైవాల సాక్షిగా, మ‌న‌స్సాక్షిగా ప్రమాణం చేసిన ప్ర‌భుత్వాల పెద్ద‌లు సైతం దానిని ప‌క్క‌కు పెట్ట‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.,  ప్రభుత్వపరమైన పదవులు చేపట్టిన  కొంద‌రి వ్య‌వ‌హార శైలి  చూస్తుంటే రాజ్యాంగ పరమైన, అంశాల‌పై వార‌కి క‌నీస ప్రాధ‌మిక స‌మాచార‌మైనా తెలుసునా అనే అనుమానం కలుగుతోంది.
 ఎందుకంటే, మతం అంటే  పూర్తిగా వ్యక్తిగతమైనదిగా పరిగణించాల్సి ఉంటుంది.  ప్ర‌భుత్వ ప‌రంగా ఎవ‌రు అధికారంలో ఉన్నా.. తన అధికార విధుల నిర్వహణలో అన్ని మతాలకు దూరంగా ఉండాల‌న్న‌ది రాజ్యాంగం చెపుతోంది. కానీ ఈ  మౌలిక లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా  అధికారిక వ‌ర్గాల‌ ఆచరణ  ఉండ‌టంతోపాటు,  అధికార కార్య నిర్వహణలో వారి ప్రవర్తన అడుగడుగునా లౌకిక స్ఫూర్తిని భంగపరుస్తోంద‌న‌టంలో సందేహ‌మేలేదు.
కానీ తెలుగురాష్ట్రాల‌లోనే కాదు, కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు సైతం ప‌దే ప‌దే ఈ రాజ్యాంగ మౌలిక లౌకిక వాద సూత్రాన్ని విస్మ‌రిస్తుం డ‌టం గ‌మ‌నార్హం.  బాహాటంగా ఈ ఉల్లంఘనలకు పాల్పడు తున్నార‌న్న‌ది య‌దార్ధం. త‌మ  అధికార కార్యక్రమాల  నిమిత్తం ప‌ర్య‌ట‌న‌లు చేసే అధికారులైనా మంత్రులైనా, చివ‌ర‌కి సిఎం, పిఎంలు సైతం  ఇందుకు వినియోగిస్తున్న‌ట్టే క‌నిపిస్తుంది. . అధికార స్థానాల్లో ఉన్నవారు దేవాల యాలను సందర్శించి, అధికార లాంఛనాలతో ప్రత్యేక దర్శనం పొందడం , మతపరమైన కార్యక్రమాలు, ఉత్సవాలలో అధికార హోదాలో పాల్గొనడం,   ఆచారాలను, సంప్రదా యాలను, క్రతువులను త‌మ‌కు  అందివ్వ‌లేద‌న్న భావ‌న వెల్లిబుచ్చ‌టం  ప్రధానమైన ఉల్లంఘన. అనే చెప్పాలి.  ప్రభుత్వపరమైన పదవులలో ఉన్నవారు అధికార కార్య నిర్వహణలో తమ వ్యక్తిగత మత విశ్వాసా లకు అనుగుణంగా ప్రవర్తించకూడ‌ద‌ని తెలిసినా మ‌నం కూడా వారి విశ్వాసాల‌ను గౌర‌విస్తున్నా.  ఇదొక సహజమైన, సాధారణమైన విష యంగానే ప‌రిగ‌ణిస్తున్నా, ఇది రాజ్యాంగ విరుద్ధ‌మ‌న్న విష‌యాన్ని అధికారులు ఏనాడో మ‌రిచిపోయిన‌ట్టు అనిపి స్తున్నది.
నిజానికి  రాజ్యాంగబద్ధ పదవుల లో, అధికారంలో ఎవ‌రున్నా వారెవరికీ లా అనుచితంగా, రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధమనే స్పృహ  ఉన్నట్లు అనిపించదు.  అతెందుకు నూతన రాజధానికి భూమిపూజ పేరిట  మత క్రతువుల్ని నిర్వహించడం లౌకిక స్ఫూర్తికి తూట్లు పొడిచేదే. కుటుంబాల‌తో క‌ల‌సి ఆల‌యాల‌లో సాధార‌ణ భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లిగేలా మంది మార్భ‌లంతో త‌మ వారసత్వ గ‌ణాల‌తో క‌ల‌సి మ‌రీ మ‌ర్యాద‌లు అందుకోవాల‌ని ప‌రిత‌పించ‌డం రాచరిక వ్యవస్థ అవశేషంగానే చెప్పాల్సి ఉంటుంది.  . శాస్త్రీయ దృష్టిని అలవర్చుకోవడాన్ని పౌరుల విధులలో ఒకటిగా నిర్దేశించిన రాజ్యాంగ అధికరణం-51ఎ(హెచ్‌) స్ఫూర్తిని కూడా  నేటి రాజ‌కీయ నేత‌లు ప‌దే ప‌దే ఉల్లంఘించడ‌మే కాదు… ప్రోటోకాల్ పేరుతో అధికారుల‌పై చేసే హుంక‌రింపులు అన్ని ఇన్నీ కావు.  
లౌకికతత్వం అంటే మతాన్ని వైయక్తిక అంశంగా చూడాల్సిన అవ‌స‌రం ఉంది.. రాజ్య వ్యవహారాల్లో మ‌తం అనే దానికి స్థానం లేకుండా అన్ని రకాల మత ఆచార వ్యవహారాలకు   దూరంగా అధికార ప‌ద‌వుల‌లో ఉండేవారు ఉండాల్సి ఉండాలి. కానీ    త‌మ కార్యకలాపాలలో అన్ని మతాలను సమానంగా చూడ లేక పోతున్నారు.  చివ‌రికి  ప్రభుత్వం జరిపే అధికారిక కార్యక్రమాలలో మత చెందిన ప్రతీకలను, క్రతువులను, సంప్రదాయాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇది లౌకిక స్ఫూర్తిని ఉల్లంఘించడ‌మే. ఇటీవ‌ల కాలంలో ఇది మ‌రీ ఎక్కువైంది. కేవ‌లం ఆల‌య ద‌ర్శ‌నాల‌కే ప‌రిమితం కాలేదు. అధికారంలో ఉన్న‌వారి చ‌ర్య‌లు కార‌ణంగా  య‌ద యౌభ్యం పెరుగుతోంద‌న్న వాద‌నా లేక‌పోలేదు. దేశ కాల‌మాన స‌రిస్థితులు శ్ర‌ద్ధ‌గా గ‌మ‌నించేవారికి ఇవి ఖ‌చ్చితంగా క‌నిపిస్తాయి. 
దీర్ఘకాలంగా ఒక ధోర‌ణి కానసాగుతూ వ‌స్తుండ‌టం వ‌ల్లే   మతం వైపు మొగ్గు చూపుతున్నదనే వాదనకు బలంగా నిలుస్తుంది. దీని వ‌ల్ల   మత ఘర్షణలు, మైనారిటీలపై దాడులు, ఉగ్రవాద ఘటనలతో  సంక్లిష్టంగా  పరిస్థితిని మ‌న‌మే మార్చుకుంటున్న‌ట్టు అనిపిస్తోంది.  ఈ భావన కలిగేలా అధికారిక పెద్ద‌లు ప్రవర్తించడం మరింత సమస్యాత్మకంగా మారుస్తోంది.  విభిన్న మతాల ప్రజల మధ్య వైషమ్యాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇది సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తోంది. ఇందుకు భిన్నంగా రాజ్యం లౌకికతత్వానికి పూర్తిగా కట్టు బడి ఉన్నట్లయితే సమాజ జీవనంలో మత ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి, విశాల జాతీయ అస్తిత్వాన్ని, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొం దించడం సాధ్యమౌ తుంది.   రాజ్యాంగ మౌలిక లౌకిక సూత్రాన్ని గట్టిగా అమలు చేసే విధంగా పౌర సమాజం ప్రభుత్వం పై ఒత్తిడి తేవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  .
ఇక నుంచైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను ఏ మత ఛాయలు లేని సెక్యులర్‌ పద్ధతులలో మాత్రమే నిర్వహించడ‌మే  ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అనే అంశాన్ని ఎవ‌రు అధికారంలో ఉన్నా గ‌మ‌నించి సాగాలి. మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌లో  పాలొ్గ‌ని, ప్రార్థనా స్థలాలను సందర్శించి,  అధికార  హోదాలో  త‌మ‌కు ప్ర‌ధాన ప్రోటోకాల్‌ని అందాల‌న్న ప‌ద్ద‌తుల‌కు దూరంగా ఉండాలి.  ఉత్సవాలలో, కార్యక్రమాలలో   అధికార హోదాలో  ప్రభుత్వం, అధికార వర్గం సెక్యులర్‌ స్ఫూర్తిని భంగపరచడానికి అవకాశం లేకుండా చేయ డానికి ఒక సమగ్ర మార్గదర్శక నియమావళిని రూపొందించి, దానిని ముఖ్యమంత్రి నుంచి సాధారణ ప్రభుత్వోద్యోగి వరకు అందరూ పాటించేటట్లుగా చర్యలు తీసుకోవటం ద్వారానే  లౌకికతను ఒక రాజకీయ సిద్ధాంతంగా మాత్రమే కాక ఒక జీవన విధానంగా మారుతుంది.   రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కాపాడేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాల్సిన బాధ్య‌త కూడా పౌరుల‌పై ఉంది. 

Leave a Reply

Your email address will not be published.